»   » షాకింగ్... : ర‌తి టైటిల్ తో ప్రముఖ నిర్మాత ఎమ్ .ఎస్ రాజు చిత్రం , అడల్ట్ ఫిల్మ్

షాకింగ్... : ర‌తి టైటిల్ తో ప్రముఖ నిర్మాత ఎమ్ .ఎస్ రాజు చిత్రం , అడల్ట్ ఫిల్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు తో ఒక్కడు, సిద్దార్దతో నువ్వు వస్తానంటే నే వద్దంటానా, ప్రభాస్ తో వర్షం వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఎమ్.ఎస్ రాజు గారు గత కొంతకాలంగా హిట్ కి దూరం అయ్యారు. దానికి కారణం చాలా మంచి మెగా ఫోన్ పట్టి డైరక్ట్ చేయటమే అని విమర్శలూ వచ్చాయి. వాన, తన కుమారుడుతో తూనీగ తూనీగ చిత్రాలు ఆయన డైరక్ట్ చేసారు. ఆ రెండూ భాక్సాఫీస్ వద్ద అలరించలేదు.

అయితే ఆయన మంచి టేస్ట్ ఉన్న నిర్మాత అని ఇప్పటికీ చెప్తూంటారు. ఈ నేపధ్యంలో ఆయన మరో సారి ఓ చిత్రం ఎనౌన్స్ చేసారు. అయితే ఈ సారి ఆయన చేయబోయే చిత్రం ఏ యాక్షన్ చిత్రమో కాదు..శృంగార భరిత చిత్రం. ఆశ్చర్యపోకండి..అది నిజమే. ఈ విషయమై అఫీషియల్ గానే ఎనౌన్స్ చేసారు. ఇక ఈ చిత్రం టైటిల్ ..రతి అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని ఆరు భాషల్లో ..తెలుగు,తమిళ, మరాఠి, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల చేస్తారు.

M S Raju announces adult film 'Rathi'

ఇప్ప‌టి వ‌ర‌కు అతి కొద్ది మంది ద‌ర్శ‌కులు, అందులోనూ అగ్ర ద‌ర్శ‌కులు మాత్ర‌మే స్పృశించిన వైవిధ్య‌మైన కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డానికి ఆయ‌న సిద్ధ‌మ‌వ్వటం అందిరకీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

త‌మిళంలో బాల‌చంద‌ర్‌, శ్రీధ‌ర్‌, మ‌ల‌యాళంలో భ‌ర‌త‌న్‌, క‌న్న‌డ‌లో పుట్ట‌ణ్ణ క‌ణ‌గ‌ళ్ వంటి గొప్ప ద‌ర్శ‌కులు ఈ జోన‌ర్‌లో చిత్రాల‌ను తెర‌కెక్కించారు. అలాంటి ప‌టిష్ట‌మైన‌, సౌంద‌ర్యాత్మ‌క‌మైన, క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుండే కావ్యాత్మ‌క‌మైన క‌థ‌తో ఈ తాజా చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి ఎమ్మెస్ రాజు సంసిద్ధుల‌య్యారని చెప్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి మొద‌లుకానుంది.

ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ శృంగార‌భ‌రితంగా సాగే వినూత్న‌మైన చిత్ర‌మిది. ర‌తి అనే టైటిల్‌, ఈ నేప‌థ్యం విన్న వారంద‌రికీ కొత్త‌గా అనిపిస్తుంది.ఆరు భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నాం. తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీతో పాటు మ‌రాఠీలోనూ సినిమాను రూపొందిస్తాం. సౌంద‌ర్యాత్మ‌కంగా క‌నిపిస్తూ, పొయిటిగ్గా సాగే చిత్ర‌మిది. నేను ఇప్ప‌టిదాకా ఇలాంటి నేప‌థ్యం ఉన్న క‌థ‌తో సినిమా చేయ‌లేదు.

కానీ అతి తక్కువ మంది, అందులోనూ హేమాహేమీ ద‌ర్శ‌కులు మాత్రం ఈ జోన‌ర్‌లో చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు తొలిసారి నేను చేస్తున్నాను. మా క‌థ సిద్ధం కాగానే చాలా ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. భారీ స్థాయిలో సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఫిబ్ర‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెడ‌తాం. అన్ని క్రాఫ్ట్స్ కి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చే చిత్ర‌మ‌వుతుంది అని అన్నారు.

English summary
M S Raju, the filmmaker of hits 'Varsham', 'Nuvvustanante Nenoddantana', made announcement of new film, which will be made in the genre of 'Srungara'. Titled 'Rathi', he will be making it in six languages - Telugu, Tamil, Marathi, Hindi, Kannada and Malayalam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu