twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    MAA Elections‌ మరో ట్విస్టు.. ఇక అంతా మీ వల్లే.. కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ..మీడియాలో లీక్‌తో గందరగోళం

    |

    తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)లో ఎన్నికలపై పలు రకాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో పలువురు ఇప్పటికే ప్యాన్సెల్స్ రూపొందించుకొని అంతర్గతంగా ప్రచారం చేసుకొంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఇప్పటికే ప్యానెల్ ప్రకటించగా.. వీకే నరేష్, మంచు విష్ణు, హేమ తదితర పేర్లు ఎన్నికల బరిలో ఉంటారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇలాంటి వివాదాస్పద అంశంలో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి రాసిన లేఖ మీడియాకు లీక్ కావడంతో ఓ కుదుపుకు టాలీవుడ్ లోనైంది. ఆ లేఖ వివరాల్లోకి వెళితే...

    ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి

    ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి

    మా అసోసియేషన్‌కు వ్యవస్థాపక అధ్యక్షుడిగా, సభ్యుడిగా కొనసాగడం గౌరవంగా భావిస్తుంటాను. ఈ సంఘంలోని ప్రతీ సభ్యుడిలోను అదే భావన ఉంటుంది. సంఘం ఏర్పాటు చేసుకొన్న విధి విధానాల ప్రకారం ప్రజాస్వామ్యబద్దంగా ఓటింగ్‌ ద్వారా కార్యవర్గాన్ని ఎన్నుకొంటున్నాం అని చిరంజీవి లేఖలో తెలిపారు. అయితే ప్రతీ రెండేళ్లకు జరిగే ఎన్నికలు కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కొనసాగుతున్నది అపద్ధరమ్మ కార్యవర్గమే అనే విషయాన్ని కృష్ణంరాజుకు రాసిన లేఖలో చిరంజీవి పేర్కొన్నారు.

    ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం మీదే

    ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం మీదే

    ప్రస్తుత పరిస్థితుల్లో అపద్ధర్మ కార్యవర్గాన్ని కొనసాగించడం మంచిది కాదు. ఆ కార్యవర్గానికి నిర్ణయాలు తీసుకొనే నైతిక హక్కు లేదు కాబట్టి వీలైనంత త్వరగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తిగా, క్రమశిక్షణా చర్య కమిటీ అధ్యక్షుడిగా మీ ఆధ్యర్యంలో ఎన్నికలు జరగాలి. ఆ ఎన్నికలు సజావుగా, వీలైనంత త్వరగా జరుగుతాయన్న నమ్మకం మాకు ఉంది. ప్రస్తుతం ఎన్నికలు జరగడానికి పరిస్థితుల అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని లేఖలో కృష్ణం‌రాజుకు చిరంజీవి సూచించారు.

    కొత్త కార్యవర్గం ఏర్పాటు అవసరం

    కొత్త కార్యవర్గం ఏర్పాటు అవసరం

    మా సంఘానికి ఎన్నికలు జరిగి.. కొత్త కార్యవర్గం ఏర్పడిన తర్వాతే ఎజెండాలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఏర్పడే కార్యవర్గం ఆ దిశగా కృషి చేయడానికి వీలు ఉంటుంది. ఏ విధంగా చూసినా వెంటనే మా సంఘానికి ఎన్నికలు జరగడం తప్పనిసరి అనే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. మార్చి నెలలో జరగాల్సిన ఎన్నికలు కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చాయి. కాబట్టి సెప్టెంబర్‌లో ఎన్నికలు జరిపించాలి. కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత గతంలో వ్యవహరించిన మాదిరిగానే రెండేళ్లపాటు కార్యవర్గం కొనసాగాలి. 2024 వరకు కొత్త కార్యవర్గం కొనసాగేలా నిర్ణయం తీసుకోవాలనే నా సూచనను పరిగణనలోకి తీసుకోవాలని కృష్ణంరాజును చిరంజీవి కోరారు.

    వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా జరగాలి

    వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా జరగాలి

    దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిశ్రమ ప్రధానమైనది. సినీరంగంలో జరిగే పరిణామాల పట్ల ప్రజలు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. కాబట్టి జరగబోయే ఎన్నికలు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా జరగాలి. అందరూ విధి విధానాలకు కట్టుబడి ఉండాలి. కొందరు సభ్యులు మీడియా ముందుకు వెళ్లి వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం వల్ల గందరగోళం ఏర్పడుతున్నది. ఇలాంటి తీరును నియంత్రణలో పెట్టాలి. సభ్యుల మధ్య ఏదైనా అభిప్రాయ బేధాలు ఉంటే ఒకరికొకరు సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగానీ బహిరంగంగా విమర్శలు చేసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని చిరంజీవి లేఖలో వెల్లడించారు.

    మీ మాటే శాసనం..

    మీ మాటే శాసనం..

    తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతీ విషయం గురించి మీకు క్షుణ్ణంగా తెలుసు. మీ మాటకు ప్రతీ ఒక్క సభ్యుడు ఎనలేని గౌరవం ఇస్తుంది. కాబట్టి మీ మార్గదర్శకత్వంలో తీసుకొనే నిర్ణయం సమస్యలను పరిష్కరించేలా చేస్తుంది. అంతేకాకుండా సభ్యుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను అని చిరంజీవి లేఖలో పేర్కొన్నారు. సోదర సమానులు, పెద్దలు అంటూ గౌరవంగా చిరంజీవి సంబోధించం విశేషం.

    Recommended Video

    MAA 2021 elections: RGV backs PrakashRaj in local non local controversy | Filmibeat Telugu

    చిరంజీవి రాసిన లేఖ

    చిరంజీవి రాసిన లేఖకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

    English summary
    Tollywood's MAA Elections become very contraversy. Megastar Chiranjeevi's letter to Krishnam Raju writes about Organising of MAA elections. That letter leaks in media goes more debatable.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X