మా అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పర్ఫెక్ట్ పర్సన్.. మా మద్దతు ఆయనకే: జయసుధ, సాయి కుమార్ కామెంట్స్
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి మరోసారి హీటెక్కింది. గత కొన్నాళ్లుగా మా అసోసియేషన్ పరిస్థితులు, విబేధాలు మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఎన్నికల సమయానికి గ్రూపులుగా విడిపోతున్న నటీనటులు హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇక ఈసారి పోటీలో ప్రకాష్ రాజ్ ఉండడంతో ఎన్నికల సమరం మరింత వేడెక్కింది. ఆయన వెంట టాప్ స్టార్స్ అందరూ ఉండడం విశేషం. ఇక జయసుధ, సాయి కుమార్ కూడా వీడియో ద్వారా వారి మద్దతును అందించారు.

మూడు దిగ్గజాల నడుమ మా పోటీ
మా ఎలక్షన్ ప్రతిసారి కూడా ఆసక్తికరంగ మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్ ఆధ్వర్యంలో మొదలైన మా ప్రయాణంలో గత మూడు ఎన్నికలల్లో కూడా పోటీ చాలా స్ట్రాంగ్ గా జరిగింది. ఇక ఈసారి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్ వంటి దిగ్గజాల నడుమ అధ్యక్ష పోటీలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది.

నాన్ లోకల్ అంటూ
ప్రకాష్ రాజ్ కర్ణాటకకు చెందిన వ్యక్తి కావడంతో ప్రత్యర్ధులు ఆయన నాన్ లోకల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కొంతమంది 20 ఏళ్లకు పైగా తెలుగులో అందరితో కలిసి ఉంటున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనడం సరికాదని అంటున్నారు.

జయసుధ కామెంట్స్
ఇక సీనియర్ నటి జయసుధ కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తూ పాజిటివ్ కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ తో కలిసి నేను ఎన్నో మంచి మంచి సినిమాలు చేశాను. ఆయన అందరికి అండగా ఉండే వ్యక్తి. ఎప్పుడు కూడా ఏదో ఒక మంచి పని చేయాలని ఆలోచిస్తారు. 2018లోనే మా ఎన్నికల్లో నిలబడాలని అనుకుంటున్నట్లు నాతో చెప్పారు. ఆయన ఆలోచన విధానం అందరికి హెల్ప్ అయ్యేలా ఉంటుంది. నా మద్దతు ప్రకాష్ రాజు కు తెలుపుతున్నాను.. అని జయసుధ వివరణ ఇచ్చారు.

సాయి కుమార్ కామెంట్స్
ఇక సాయి కుమార్ కూడా మొదట మా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వచ్చింది. కానీ ఆ తరువాత మళ్ళీ ఆయన ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నట్లు వివరణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్న మా ప్యానెల్ లో నేను కూడా ఉండడం ఆనందంగా ఉంది. మేము అందరం ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మీ సపోర్ట్ కూడా కావాలి అంటూ.. తన మద్దతు తెలియజేశారు.


Click it and Unblock the Notifications











