»   » ‘మా’ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి?

‘మా’ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సారి ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 29న ఓటింగ్ జరుగనుంది. ‘మా' అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ ఎవరి గెలుపు ప్రయత్నాల్లో వారు ఉన్నారు. మెగా ఫ్యామిలీ రాజేంద్రప్రసాద్ కు మద్దతు ఇస్తున్నప్పటికీ.... పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేస్తారు? అనేది హాట్ టాపిక్ అయింది. అయితే కొందరు ఆయన ఓటింగుకు దూరంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం 700కి పైగా సభ్యులు ఉన్న మావీ ఆర్టిస్టస్ అసోసియేషన్‌లో దాదాపు 350 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు.

‘మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్'(MAA) ఎన్నికలకు కోర్టు గ్రీన్ సింగ్నల్ ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు తదుపరి తీర్పు వెల్లడించే వరకు ఫలితాలు వెల్లడించరాదని కోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో సినీ వర్గాల్లో ఉత్కంఠకు తెర పడినట్లయింది.

 MAA elections: Pawan Kalyan in talk?

మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్ (మా)కు జరుగనున్న ఎన్నికలను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి నోటీసులు జారీ చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా' ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో సినీ పరిశ్రమలోని నటులు రెండు వర్గాలుగా చీలి పోయారు. కొందరు ‘మా' అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్‌కు మద్దతు ఇస్తుండగా, మరికొందరు జయసుధకు మద్దతు ఇస్తున్నారు.

మీడియా సమావేశాలు ఏర్పాటు ఇటు జయసుధ వర్గం, అటు రాజేంద్ర ప్రసాద్ వర్గం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడంతో ఈ ఎన్నికల విషయం హాట్ టాపిక్ అయింది. జయసుధ ప్యానెల్ ను..... వెనక నుండి దాసరి వర్గం నడిపిస్తుందని, రాజేంద్రప్రసాద్ ప్యానెల్ ని వెనక నుండి చిరంజీవి వర్గం నడిపిస్తుందనే ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి.

English summary
What is Pawan Kalyan's decision regarding MAA elections and picking one among Rajendra Prasad or Jayasudha? This may not be really needed for the eligible voters of Movie Artists Associations, but fans want to know to whom Pawan would really extend his support.
Please Wait while comments are loading...