»   »  ఆ బ్రతుకెందుకు? జయసుధకు రాజేంద్ర్రప్రసాద్ పంచ్ (ఫోటోస్)

ఆ బ్రతుకెందుకు? జయసుధకు రాజేంద్ర్రప్రసాద్ పంచ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘మా' అధ్యక్షుడిగా గెలుపొందిన రాజేంద్రప్రసాద్ ఆదివారం ప్రమాణ స్వీకరం చేసారు. హైదరాబాద్ లోని ఫిలించాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు సినీ ఆర్టిస్టులు హాజరయ్యారు. 2015 నుండి 2017 వరకు ఆయన అద్యక్షుడుగా రెండు సంవత్సరాల పాటుకొనసాగనున్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ...పేద కళాకారులకు మంచి చేయాలనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసానని, సంకల్పబలమే మమ్మల్ని ముందుకు నడిపించిందని చెప్పుకొచ్చారు. కార్పస్ ఫండ్, పెన్షన్ డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తారనే ఆందోళన అవసరం లేదు. నాగబాబుగారు విరాళంతో మొదలు పెట్టారు. విదేశాల్లోని మిత్రులు కూడా విరాళాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకొస్తాం..అన్నారు. త్వరలోనే జనరల్ బాడీ మీటింగు ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

ఇటీవల జయసుధ ప్రెస్ మీట్లో రాజేంద్రప్రసాద్ కామెడీ చేసి గౌరవం కోల్పోయారు అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో....రాజేంద్రప్రసాద్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. ‘కొందరు నేను కామెడీ చేస్తున్నానని అంటున్నారు. కామెడీ లేని బ్రతుకెందుకు? కష్టాల్లో..బాధల్లో కూడా 35 ఏళ్లుగా కామెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను' అని సమాధానం ఇచ్చారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

నాగేంద్రబాబు

నాగేంద్రబాబు


నాగేంద్రబాబు మాట్లాడుతూ.....ఎన్నికల సమయంలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాం. మురళీ మోహన్ గారంటే మాకు ఎప్పుడూ గౌరవమే. ‘మా' కోసం ఎంతో కృషి చేసారు. ఈ ఎన్నికల్లో జరిగిన పరిణామాలతో రాజేంద్రప్రసాద్ లో మంచి చేయాలనే తప్ప పెరిగిందన్నారు.

విరాళం

విరాళం


అర్హులైన వారికి పెన్షన్లు, హెల్త్ కార్డులు అందించాలని కోరిన నాగబాబు....మెగా ఫ్యామిలీ నుండి రామ్ చరణ్ తరుపున 2 లక్షలు, అల్లు అర్జున్ తరుపున 2 లక్షలు, వరుణ్ తేజ్ లక్ష, సాయి ధరమ్ తేజ్ లక్ష చొప్పిన విరాళం అందించారు.

ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారం


కొత్త అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తో ప్రమాణ స్వీకారోత్సవం చేయిస్తున్న మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్.

నాగబాబు, రాజేంద్రప్రసాద్

నాగబాబు, రాజేంద్రప్రసాద్


ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపుతూ నాగబాబు, రాజేంద్రప్రసాద్ ఆత్మీయ ఆలింగనం.

అభినందనలు

అభినందనలు


నూతన అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కు అభినందనలు తెలుపుతున్న కళాకారులు.

నరేష్

నరేష్


జయసుధ ప్యానెల్ కు చెందిన నరేష్....రాజేంద్రప్రసాద్ ను అభినందిస్తున్న దృశ్యం.

మంచు లక్ష్మి

మంచు లక్ష్మి


ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న మా ఉపాధ్యక్షురాలు మంచు లక్ష్మి.

రోజా..

రోజా..


ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నటి రోజా సందడి.

తనికెళ్ల భరణి

తనికెళ్ల భరణి


ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న కార్యనిర్వాహక కార్యదర్శి తనికెళ్ల భరణి.

English summary
MAA Executive Body Swearing in ceremony Press Meet event held at Hyderabad.
Please Wait while comments are loading...