Just In
Don't Miss!
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి భగ్గుమన్న 'మా' వివాదం.. నరేష్‌పై తీవ్ర ఆరోపణలు.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 'మా' 2020 డైరీ ఆవిష్కరణలో జరిగిన పరిణామాలు సినీ వర్గాలను షాక్‌కి గురి చేయగా.. తాజాగా మా అధ్యక్షుడు నరేష్‌పై తీవ్ర ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. నరేష్‌పై కొందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం చేయడంతో మరోసారి 'మా' లుకలుకలు తెరపైకి వచ్చాయి. వివరాల్లోకి పోతే..

మా కమిటీ పట్ల రాజశేఖర్ అభియోగాలు.. ఇష్యూ హాట్ టాపిక్
'మా' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ మా కమిటీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ నరేష్ పై అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్, చిరంజీవి మధ్య ఊహించని విధంగా రాజుకున్న వివాదం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేదికపై రాజశేఖర్ ప్రవర్తించిన తీరును మోహన్‌బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితరులు తప్పు బట్టారు. దీంతో ఈ ఇష్యూ కాస్త జనాల్లో హాట్ టాపిక్ అయింది.

రాజశేఖర్ రాజీనామా.. నరేష్ తీరుపై అసంతృప్తి
ఈ ఉదంతం అనంతరం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఓ ప్రకటన జారీ చేశాడు రాజశేఖర్. దీంతో పాటు ఓ లేఖను కూడా విడుదల చేస్తూ కారణాలను కూడా వివరించాడు. నరేష్ వ్యవహారశైలి కారణంగానే తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపాడు. మా మెంబర్స్ నిర్ణయాలకు నరేష్ విలువ ఇవ్వడని, అతనిది ఏకపక్ష ధోరణి అంటూ ఆరోపణలు చేశాడు.

క్రమశిక్షణ చర్యల కోసం కమిటీ.. చిరంజీవి సహా
ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో రాజశేఖర్ రాజీనామాను ఆమోదించింది 'మా'. అలాగే దీంతో పాటు క్రమశిక్షణ చర్యల కోసం ఉన్నతస్థాయి కమిటీని కూడా నియమించింది. కృష్ణంరాజు, చిరంజీవి, మురళీమోహన్, మోహన్ బాబు, జయసుధలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

క్రమశిక్షణ కమిటీకి లేఖ.. నరేష్‌పై అభియోగాలు
దీంతో ఈ క్రమశిక్షణ కమిటీ నరేష్‌పై తాము చేసిన అభియోగాలపై చర్య తీసుకుంటుందని జీవిత ఆశించింది. కానీ ఆ కమిటీ వేసి ఇప్పటికే దాదాపు 15 రోజులు గడిచినా నరేష్‌పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంతో కొందరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు.

'మా' అభివృద్ధికి నరేష్ అడ్డుపడుతున్నారు
'మా' నిధులు నరేష్ దుర్వినియోగం చేస్తున్నారని, అలాగే 'మా' అభివృద్ధికి నరేష్ అడ్డుపడుతున్నారని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుకు శివాజీరాజాపై నరేష్ ఆయన తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. 'మా' సొమ్మును నరేష్ తన సన్నిహితులకు దారాదత్తం చేస్తున్నారని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంటున్నారు. దీంతో మా వివాదం మరోసారి చర్చల్లో నిలిచింది.