twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లూఫిల్ముల్లో కాదు..

    By Staff
    |

    Murali mohan
    'మేమంతా సినిమాలలో మాత్రమే నటిస్తాం, బ్లూఫిల్ములలో కాదు. సెన్సార్ బోర్డు నిబంధనలకు అనుగుణంగానే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుందనీ, ఆమోదించిన సన్నివేశాలే బయట ప్రదర్శనకు వస్తాయన్న విషయం కూడా అమెకు తెలుసు. పాత్రలు వేరు నిజజీవితం వేరు. విలన్ పాత్రలలో నచింటినంతమాత్రాన నిజజీవితంలో విలన్లు కారు. అలాగే వ్యాంప్ పాత్రలో నచిటించినవారంతా చెడ్డవారు కాదు. హీరోల పాత్రలు పోషించినవారంతా హీరోలూ కాదనీ' మా ఆసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ తీవ్ర స్వరంతో అన్నారు.

    తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సినీనటి రోజాపై, ప్రజారాజ్యం మహిళా విభాగం అధ్యక్షురాలు శోభారాణి చేసిన విమర్శలను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఖండించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఆసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ, శోభారాణి వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు.

    చదవుకున్న వ్యక్తిగా, సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పని చేసిన శోభారాణి ఒక నటిని పరుషపదజాలంతో దూషించడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. తెలుగు చలన చిత్రానికి చెందిన నటులు ఎవరెవరు ఏ పార్టీలలో ఉన్నా వ్యక్తిగత దూషణలు మానుకోవాలన్నారు. ఇలాంటి ధోరణులను అరికట్టేందుకు అందరూ బాధ్యతగా పూనుకోవాలన్నారు. ఇప్పటికే రోజా క్షమాపణ చెప్పింది, అలాగే శోభారాణి కూడా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.

    తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాపై పిఆర్‌పి మహిళా రాజ్యం చీఫ్‌ శోభారాణి వ్యాఖ్యలను సినీ ప్రముఖులు ఖండించారు. ఎవరైనాసరే రాజకీయాల్లో నైతికంగా దిగజారుడు వ్యాఖ్యలను మానుకోవాలని మురళీమోహన్‌ హితవు పలికారు. సినీ ఆర్టిస్ట్‌లపై చులకనభావంతో చూడటం తగదని జీవితారాజశేఖర్‌ అన్నారు. తమపై అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం సరైన పద్దతి కాదని జయసుధ వ్యాఖ్యానించారు.

    ప్రజారాజ్యం మహిళా అధ్యక్షురాలు శోభారాణి, తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు రోజా పరస్పరం చేసుకున్న మాటల దాడి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శోభారాణి వ్యాఖ్యలను ప్రజారాజ్యం పార్టీ అధినేత తీవ్రంగా ఖండిస్తే, రోజాను చంద్రబాబు తీవ్రంగా మందలించి, శోభారాణికి తీవ్రంగా హెచ్చరిక చేశారు.

    మరోపక్క ఎలక్ట్రానిక్‌ మీడియాలో మహిళా నేతలు వీరి ధూషణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. మహిళలపై మహిళలే అసభ్య పదజాలంతో ధూషించుకోవడానికి రాజకీయాలే కారణమని ధ్వజమెత్తారు. ఇంకోపక్క రోజా శనివారం నాడు కూడా ప్రజారాజ్యం పార్టీపై విమర్శల దాడి ఆపలేదు. చిరంజీవిని టార్గెట్‌గా చేసుకుని రోజా ప్రశ్నాస్త్రాలు సంధించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X