»   » ఉత్కంఠ: ‘మా’ ఎన్నిక ఫలితాలు మళ్లీ వాయిదా

ఉత్కంఠ: ‘మా’ ఎన్నిక ఫలితాలు మళ్లీ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (మా) ఎన్నికల ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ రోజు ఫలితాలు వెలువరించడానికి కోర్టు అనుమతిస్తుందని అంతా భావించారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది.

ఎన్నికలు గత నెల చివర్లో పూర్తయినా కోర్టు కేసు కారణంగా ఫలితాలు ఇంకా వెలువడలేదు. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయాలని, కోర్టు తదుపరి తీర్పు వెల్లడించే వరకు ఫలితాలు వెల్లడించరాదని అప్పట్లో కోర్టు ఆదేశించింది ‘మా' ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ నటుడు ఒ.కళ్యాణ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయమూర్తి ‘మా' ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్, ప్రధాన కార్యదర్శి ఆలీకి నోటీసులు జారీ చేశారు.

MAA President elections results postponed to 9th

ఈ నేపథ్యంలో ప్రముఖ నటులు మురళీమోహన్, అలీలు మంగళవారం కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. 'మా' ఎన్నికల జరిగిన తీరును వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు గత నెల 31న కోర్టుకు సమర్పించారు.

(మా) ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్ వర్గం...., జయసుధ వర్గం ఒకరిపై ఒకరు విమర్శలు, మాటల తూటాలతో ఎన్నికల వాతావరణాన్ని హీటెక్కించారు. ఈ నేపథ్యంలో ‘మా' అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

English summary
Movie Artists Association President elections results postponed to April 9th.
Please Wait while comments are loading...