»   » డ్రగ్స్ కేసు: వర్మ వ్యాఖ్యలతో షాక్, సీన్లోకి ‘మా’ ప్రెసిడెంట్

డ్రగ్స్ కేసు: వర్మ వ్యాఖ్యలతో షాక్, సీన్లోకి ‘మా’ ప్రెసిడెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓ వైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు సెలబ్రిటీలను విచారిస్తుంటే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలతో సినీ ఇండస్ట్రీలో కంగారు మొదలైంది. వర్మ వ్యాఖ్యలతో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఇలాంటి సమయంలో పోలీసులకు కోపం వచ్చేలా వర్మ మాట్లాడటం సరి కాదని అంటున్నారు.

వర్మ వ్యాఖ్యల నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివాజీ రాజా స్పందించారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేమీ లేదని, వర్మ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

వర్మ వ్యాఖ్యలతో నష్టం లేదు

వర్మ వ్యాఖ్యలతో నష్టం లేదు

ఓ ప్రముఖ పత్రికతో శివాజీ రాజా స్పందిస్తూ.... ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ కేసుకు ఒరిగేదేం లేదని, ఈ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు, విచారణ చేపట్టిన అధికారులకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు. సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజా నిజాలు వెల్లడవుతాయి, ఈ కేసులో ఇండస్ట్రీతో పాటు బయటి వారు ఏం మాట్లాడినా అబద్దాలు నిజం కావు, నిర్దోషులుగా ఉన్న వారిని దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదు అన్నారు.

Ram Gopal Varma to make Sr. NTR biopic
వర్మ కాంమెంట్స్ ఇవే...

వర్మ కాంమెంట్స్ ఇవే...

డ్రగ్స్ కేసులో ఇండస్ట్రీ వారిని విచారించినట్లుగానే వాటిని వాడిన స్కూలు, కాలేజీ విద్యార్థులను విచారిస్తారా? అని వర్మ ప్రశ్నించారు. అకున్ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలిలా చూపిస్తోందని, అతడితో రాజమౌళి బాహుబలి 3 సినిమా తీస్తారేమో అంటూ వర్మ కామెంట్ చేశారు.

మానవత్వం లేదు

మానవత్వం లేదు

అకున్ సబర్వాల్ కు మానవత్వం లేదని వర్మ విమర్శించాడు. సిట్ దర్యాప్తు తీరును స్వయంగా అకున్ సబర్వాల్ ఎందుకు వెల్లడించడం లేదు? మీడియాకు లీకులెలా అందుతున్నాయి? మీడియాకు లీకులు అందకుండా చూడాల్సిన బాధ్యత ఆయనకు లేదా? అని ప్రశ్నించారు.

పరువుకు భంగం

పరువుకు భంగం

మీడియా కథనాలతో సినీ పరిశ్రమలోని కొందరు వ్యక్తుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియా కథనాలకు తక్షణం ఆపాలని వర్మ సూచించాడు. ఏ ఆధారాలు లేకుండా సినిమా వాళ్లను ఎలా అనుమానిస్తున్నారని ఆయన ప్రశ్నించాడు. ప్రజల మనసులు చెడిపోకముందే అకున్ సబర్వాల్ స్పందించాలని సూచించాడు.

English summary
Movie Artistes Association (MAA) President Shivaji Raja lambasted Ram Gopal Varma for making sensational allegations against investigation in Drug Racket Case. 'There is nothing that Varma has done to the Industry. It's better to ignore the comments made by him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu