»   » కత్తితో పొడిచా, నా కాలిగోటికి సరిపోడు ఎదవ: శివాజీరాజా సంచలనం

కత్తితో పొడిచా, నా కాలిగోటికి సరిపోడు ఎదవ: శివాజీరాజా సంచలనం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడిగా, కమెడియన్‌గా శివాజీ రాజా అందరికీ సుపరిచితమే. నటుడిగా అతడి వ్యవహారాన్ని పక్కన పడితే..... నిజ జీవితంలో శివాజీ రాజాపై ఎన్నో వివాదాలున్నాయి. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్ ఎన్నికైన సమయంలో శివాజీ రాజా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.... అప్పట్లో శివాజీ రాజా తల్లిదండ్రులు తమకొడుకు సరిగా చూసుకోవడం లేదంటూ మీడియాకెక్కారు. ఇన్నాళ్లు తన వ్యక్తిగత జీవితం, తన చుట్టు ఉన్న వివాదాల గురించి ఎప్పుడూ, ఏ సందర్భంలో కూడా మాట్లాడని శివాజీ రాజా.... తాజాగా టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.

ఇటీవలే 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన శివాజీ రాజా ఈ ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు చెప్పుకొచ్చారు.

 సినిమాల్లోకి రాక ముందు డిస్కో

సినిమాల్లోకి రాక ముందు డిస్కో

సినిమాల్లోకి రాక ముందు డిస్కో డాన్సర్ గా చేసినట్లు మాకు తెలిసిందని టీఎన్ఆర్ ప్రశ్నించగా.... ఆ విషయం మీకు ఎలా తెలిసింది అంటూ ఆశ్చర్యపోయారు శివాజీ రాజా.

ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకరిని పొడిచా

ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకరిని పొడిచా

ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్టాండులో ఒక వ్యక్తిని కత్తితో పొడిచిన మాట వాస్తమే అని శివాజీ రాజా ఒప్పుకున్నారు. అప్పట్లో ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే మీ నాన్నను ఎవరో కొడుతున్నారని చెప్పడంతో ఇంటికెళ్లి వంటింట్లో ఉండే కత్తితో వెళ్లాను. బస్టాండ్లో దొరికేసాడు...మానాన్నను కొట్టాడన్న కోపంతో పొడిచేసాను అని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

ఘోరమైన యక్సిడెంట్

ఘోరమైన యక్సిడెంట్

గతంలో కారు ప్రమాదం జరుగ్గా దేవుడి దయ వల్ల బ్రతికి బయట పడ్డాను. ఆ ఘోర యాక్సిడెంటులో మా డ్రైవర్ రెండు కళ్లు ఊడిపోయి కిందపడ్డాయి. అదో భయానక అనుభవం అని శివాజీ రాజా తెలిపారు.

 తల్లి, తండ్రి మీడియాకెక్కడంపై

తల్లి, తండ్రి మీడియాకెక్కడంపై

మా మదర్, ఫాదర్ నేను వారిని సరిగా చూసుకోవడం లేదని అప్పట్లో మీడియాకెక్కారు. వాళ్లు అలా టీవీకెక్కడానికి కారణం నా తోటి ఆర్టిస్టే... వాడి జీవితమంతా ఇలాంటి దరిద్రపు పనులే చేసాడు, అందుకే ముందే వెళ్లిపోయాడు అంటూ శివాజీ రాజా సంచలన కామెంట్స్ చేసారు. ఆ సమయంలో ఓ పెద్ద హీరో పిలిచి నీతులు చెప్పారు అంటూ శివాజీ రాజా తెలిపారు.

మురళీ మోహన్ కు క్షమాపణ

మురళీ మోహన్ కు క్షమాపణ

మురళీ మోహన్ గురించి గతంలో ‘మా' ఎలక్షన్ సమయంలో ఈ ఓటమి జయసుధది కాదు మురళీ మోహన్ గారిది అన్నాను. అలా మాట్లాడటం నా తప్పే. ఈ విషయంలో ఆయనకు క్షమాపణ చెబుతున్నాను అని శివాజీ రాజా తెలిపారు.

నా కాలి గోటికి కూడా సరిపోడు ఎదవ

నా కాలి గోటికి కూడా సరిపోడు ఎదవ

అందరం కలిసి ఈ రెండేళ్లు కష్టాన్ని మీదేసుకుని, లేని నవ్వును తెచ్చుకుని ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'ను కాపాడాము. ప్రముఖ నటుడు రంగనాథ్ మరణించినపుడు ఆయన్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు తీసుకొస్తే... ఓ పెద్ద మనిషి ఆయన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అన్నాడు. నాకు వెంటనే కొపం వచ్చి తిట్టేసాను. అలా మాట్లాడిన మనిషి నా కన్నా గొప్ప నటుడే... కానీ నా కాలి గోటికి కూడా సరిపోడు ఎదవ... అంటూ మండి పడ్డారు శివాజీ రాజా. శివాజీ రాజా ఎవరి గురించి అలా మాట్లాడారు అనేది శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయ్యే పూర్తి ఇంటర్వ్యూలో వెల్లడి కానుంది.

 రాజేంద్రప్రసాద్ గురించి ఏం చెప్పారు?

రాజేంద్రప్రసాద్ గురించి ఏం చెప్పారు?

రాజేంద్ర ప్రసాద్ నా అన్న కాదు. నా కంటే సీనియర్.. గొప్ప ఆర్టిస్టే అనే గౌరవం ఉంది. ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన మనిషి అవ్వక్కర్లేదు.... అంటూ శివాజీ రాజా ఇంటర్వ్యూ సాగింది. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు రిలీజ్ అయ్యే పూర్తి ఇంటర్వ్యూలో శివాజీ రాజా ఇలా ఎందుకు మాట్లాడారు? అనే విషయాలు బయటకు రానున్నాయి.

English summary
MAA president Shivaji Raja sensation comments about Tollywood industry. Sivaji Raja is a Telugu comedian and actor. Sivaji Raja appeared in more than 400 films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu