»   » తప్పు చేస్తే కాళ్లు పట్టించాం, శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

తప్పు చేస్తే కాళ్లు పట్టించాం, శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వం: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు 'మా' సభ్యత్వం ఇవ్వడం లేదు, తన పోరాటంపై ఇండస్ట్రీ పెద్దలు, ప్రభుత్వం స్పందించడం లేదు అంటూ రోడ్డుపై అర్దనగ్న ప్రదర్శన చేసిన నటి శ్రీరెడ్డి చర్యను వ్యతిరేకిస్తూ 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేసన్ (మా) ఆదివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'మా' ప్రెసిడెంట్ శివాజీ రాజా మాట్లాడుతూ శ్రీరెడ్డి లాంటి వ్యక్తులకు 'మా'లో సభ్యత్వం ఎప్పటికీ ఇవ్వబోమని తేల్చి చెప్పారు.

Sri Reddy Exclusive Clothes Removing Video
అలా ఎలా అవకాశాలు ఇస్తారు?

అలా ఎలా అవకాశాలు ఇస్తారు?

ఎన్నో వేల మంది ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. వాళ్ల కష్టానికి తగ్గట్లు, అదృష్టానికి తగ్గట్లు కొంత మందికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ప్రతి వారు ఇక్కడ సక్సెస్ అవుదామంటే కుదరకపోవచ్చు. వాళ్లను వారు నిరూపించుకోవాలి, హీరోనో, హీరోయినో అవ్వాలనుకుంటే వారు సొంతంగా సినిమాలు తీసుకోవాలి. అంతే కానీ మాకు హీరో ఛాన్స్ ఇవ్వండి, మాకు హీరోయిన్ ఛాన్స్ ఇవ్వండి అంటే ఇక్కడ ఇవ్వడం జరుగదు.... అని శివాజీ రాజా అన్నారు.

శ్రీరెడ్డి చర్య మనస్తాపానికి గురి చేసింది

శ్రీరెడ్డి చర్య మనస్తాపానికి గురి చేసింది

శ్రీరెడ్డి అర్దనగ్న ప్రదర్శన మనస్తాపానికి గురి చేసింది. ‘మా' తరుపున ఇన్ని మంచి పనులు జరుగుతుంటే మధ్యలో ఇలా జరుగుతుందేమిటి అనుకున్నాను. ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పేరెత్తినా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి తప్పుగా మాట్లాడినా సహించేది లేదు. ఈ కమిటీ ఎన్నో మంచి పనులు చేస్తోంది. మీరు రాయి విసిరితే మేము దాన్ని తిప్పి మీ మీద విసరక పోవచ్చేమో కానీ నిజాలు చెప్పే బాధ్యత మా కమిటీకి ఉంది.... అని శివాజీ రాజా అన్నారు.

శ్రీరెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే, చీప్ పబ్లిసిటీ

శ్రీరెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే, చీప్ పబ్లిసిటీ

నిన్న శ్రీరెడ్డి మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదు. ఆమె పబ్లిసిటీ కోసమే ఇదంతా చస్తోంది. ఇంత కాలం ఆమెపై సానుభూతి ఉండేది. నన్ను కలిసినపుడు మేము ఉన్నాము అమ్మా అని మాటివ్వడం జరిగింది. మీకు ఏమైనా సమస్య ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ చాలా ఉన్నాయి వారికి కంప్లయింట్ ఇవ్వండి. ఇవేవీ కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో చీప్ పబ్లిసిటీ కోసం మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు.... అని శివాజీ రాజా అన్నారు.

శ్రీరెడ్డికి మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం జరుగదు

శ్రీరెడ్డికి మెంబర్ షిప్ కార్డు ఇవ్వడం జరుగదు

శ్రీరెడ్డి లాంటి వ్యక్తులను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంకరేజ్ చేయదు. ఈ అమ్మాయికి కార్డు ఇవ్వడం అనేది జరుగదు. అంతే కాదు ‘మా' 900 మంది సభ్యులు ఈ అమ్మాయితో యాక్ట్ చేయరు. ఒక వేళ ఆమెతో ఎవరైనా నటిస్తే వారిని ‘మా' నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది అని శివాజీ రాజా అన్నారు.

తేజగారు ఛాన్స్ ఇచ్చారు, అయినా ఎందుకు ఇదంతా?

తేజగారు ఛాన్స్ ఇచ్చారు, అయినా ఎందుకు ఇదంతా?

తేజ గారు ఛాన్స్ ఇచ్చారు. అలాగే మరో నిర్మాత కూడా ఆమెకు 50 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అమ్మాయికి నిజంగా సినిమా మీద ప్రేమ ఉంటే, సినిమాలే చేయాలనుకుంటే అవి చేసుకోవచ్చుగా. అది చేసుకోకుండా చీప్ పబ్లిసిటీ కోసం అస్తమానం ఛానల్స్‌లో చూపిస్తున్నారు కదా అని బట్టలిప్పుకుని తిరిగితే ఎలా? మేము మెంబర్ షిప్ ఇస్తే చాలా మంది బట్టలిప్పుకుని తిరుగుతారు. మాకూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ మేము ఫాలో చేయాల్సిన బాధ్యత ఉంటుంది... అని శివాజీ రాజా అన్నారు. ః

తప్పు చేస్తే అమ్మాయి కాళ్లు పట్టించాం

తప్పు చేస్తే అమ్మాయి కాళ్లు పట్టించాం

ఎన్నో కష్టాలు ఓర్చుకుని మేము అసోసియేషన్ నడుపుతున్నాం. మొన్న ఒక అమ్మాయి ఒక వ్యక్తిపై కంప్లయింట్ చేస్తే 24 క్రాప్ట్స్ ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో కనుక్కుని పిలిపించి అతడు తప్పు చేశాడు కాబట్టి ఆ అమ్మాయి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించి పంపించాం. ఇవన్నీ మేము బయటకు చెప్పుకుంటామా? చెప్పుకోం కదా.... అని శివాజీ రాజా అన్నారు.

బట్టలిప్పుకుని తిరిగితే కార్డు ఇస్తారని అనుకోవద్దు

బట్టలిప్పుకుని తిరిగితే కార్డు ఇస్తారని అనుకోవద్దు

శ్రీరెడ్డి లాంటి వారికి మెంబర్ షిప్ కార్డు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే చాలా మంది వస్తారు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం... నడివీధిలో బట్టలిప్పుకుని తిరిగి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలు నిజం కాదు, అసలు ఏం జరిగిందో చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయవద్దు. ఇలా చేస్తే కార్డు ఇస్తారని ఊహించుకోవద్దు.... అని శివాజీ రాజా అన్నారు.

ఇలాంటి వ్యక్తులను మీడియా ఎంకరేజ్ చేయవద్దు

ఇలాంటి వ్యక్తులను మీడియా ఎంకరేజ్ చేయవద్దు

ప్రతి అసోసియేషన్ కు కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని మేము ఫాలో అవ్వాలి. మాకు స్త్రీలంటే చాలా గౌరవం ఉంది. మా కమిటీలో కూడా స్త్రీలు ఉన్నారు. అసోసియేషన్ వ్యాల్యూస్ ఏమిటో వారికి తెలుసు. మీడియా సోదరులు కూడా ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడే మానసిక రుగ్మతులు ఉన్న వ్యక్తులను ఎంకరేజ్ చేయవద్దు.... అని శివాజీ రాజా అన్నారు.

English summary
MAA Association Press Meet Against Sri Reddy Issue. MAA President Sivaji Raja Fires On Sri Reddy. He said, "We wouldn't give a MAA membership to Sri Reddy".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X