రామ్ సినిమాలో విలన్‌గా మాధవన్.. ఆ వార్తలపై కుండబద్దలు కొట్టిన సీనియర్ హీరో

ఇటీవల కాలంలో కొంతమంది సీనియర్ హీరోలు హీరోగా మార్కెట్ తగ్గడంతో మెల్లగా స్పెషల్ రోల్స్ తో మెప్పిస్తున్న విషయం తెలిసిందే. వీలైతే విలన్ రోల్స్ చేయడానికి కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. అలా యూ టర్న్ తీసుకున్న కొంతమంది స్మార్ట్ హీరోస్ కూడా భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటూ బిజీగా మారుతున్నారు. ఇక త్వరలోనే మాధవన్ కూడా భయంకరమైన విలన్ పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

ఆ ఒక్క సినిమాతోనే..

ఆ ఒక్క సినిమాతోనే..

మాధవన్ అంటే ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. లవర్ బాయ్ కథలకు ఎక్కువగా అతన్నే సెలెక్ట్ చేసుకునేవారు. మణిరత్నం దర్శకత్వంలో చేసిన సఖీ సినిమా ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక తరువాత కూడా అలాంటి రొమాంటిక్ సినిమాలతో మాధవన్ అమ్మాయిల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు.

తెలుగులో డిజాస్టర్స్

తెలుగులో డిజాస్టర్స్

ఎక్కువగా హిందీ తమిళ్ సినిమాలతో క్రేజ్ అందుకున్న మాధవన్ కేవలం హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ తో కూడా మెప్పించాడు. త్రి ఇడియట్స్ లో చేసిన పాత్ర కూడా మాంచి గుర్తింపును అందించింది. అయితే తెలుగులో మాత్రం మాధవన్ సరైన సక్సెస్ చూడలేదు. సవ్యసాచి, నిశ్శబ్దం సినిమాల్లో విలన్ రోల్స్ చేసినప్పటికీ ఆ సినిమాలు సక్సెస్ అవ్వలేదు.

 రామ్ సినిమాలో విలన్

రామ్ సినిమాలో విలన్

ఇక చాలా కాలం అనంతరం మాధవన్ రామ్ పొతినేని - లింగుస్వామి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అందరూ అది నిజమని అనుకున్నారు. ఆ సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కుతున్న ద్విభాషా సినిమా కావడంతో వెంటనే ఒప్పేసుకున్నట్లు తమిళ్ లో కూడా కథనాలు వచ్చాయి.

Recommended Video

Working With Comedian Bhadram Is a Learning Experience - Altaf Hassan
క్లారిటీ ఇచ్చిన మాధవన్

క్లారిటీ ఇచ్చిన మాధవన్

ఇక ఫైనల్ గా అందులో ఎలాంటి నిజం లేదని మాధవన్ క్లారిటీ ఇచ్చేశాడు. మాధవన్ - లింగుస్వామికి మంచి స్నేహం ఉంది. వీరి కాంబోలో వచ్చిన రన్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఇక అతనితో వర్క్ చేయడం ఎల్లప్పుడూ తనకు ఇష్టమే అని వివరణ ఇచ్చిన మాధవన్ ప్రస్తుతం ఆయన తెలుగు సినిమాలో విలన్ గా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X