»   » పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ..ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అంటున్న హీరోయిన్!

పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ..ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదు అంటున్న హీరోయిన్!

Subscribe to Filmibeat Telugu
పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ అంటున్న హీరోయిన్!

నచ్చావులే, స్నేహితుడా వంటి చిత్రాలతో హీరోయిన్ గా నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది మాధవీలత.కొన్ని చిత్రాలతో మాత్రమే మాధవీలత కెరీర్ ముగిసింది. ప్రస్తుతం మాధవీలత చేతిలో ఎటువంటి సినిమాలు లేవు. కానీ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో మాత్రం మెరుస్తుంటుంది. తాజాగా మాధవీలత సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. మాధవీలత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ రెండు చిత్రాలతో

ఆ రెండు చిత్రాలతో

మాధవీలత నటించిన నచ్చావులే చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత స్నేహితుడా చిత్రంలో నాని సరసన నటించింది. ఆ చిత్రం కూడా విజయం సాధించింది. ఈ రెండు చిత్రాలతో మాధవీలతకు గుర్తింపు లభించినప్పటికీ ఆ తరువాత మంచి అవకాశాలు రాలేదు.

అచ్చతెలుగు హీరోయిన్

అచ్చతెలుగు హీరోయిన్

టాలీవుడ్ లో ఉన్న కొద్ది మంది తెలుగు హీరోయిన్లలో మాధవిలత కుడా ఒకరు. మాధవీలత ప్రస్తుతం తెలుగులో ఏచిత్రం లోను నటించడం లేదు.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

మాధవి లతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలని అభిమానులతో పంచుకుంటుంటారు. తాజగా మాధవీలత తన పేస్ బుక్ పేజ్ లో పవన్ కళ్యాణ్ గురించిపెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

పవన్ అంటే ఇష్టం

పవన్ అంటే ఇష్టం

పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టం ఉన్న విషయాన్ని గత పదేళ్లుగా పలు ఇంటర్వ్యూ లలో వెల్లడిస్తున్నానని మాధవీలత అన్నారు. నాకు సమాజ సేవ కూడా చాలా ఇష్టం అని మాధవీలత అన్నారు.

నక్షత్ర ఫౌండేషన్

నక్షత్ర ఫౌండేషన్

సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో నక్షత్ర ఫౌండేషన్ ని తాను స్థాపించినట్లు మాధవీలత అన్నారు. కానీ నిధులు, సపోర్టర్స్ లేక నా కోరిక నెరవేరలేదు. కానీ సమాజ సేవ చేయాలనే తన పట్టుదల ఇంకా చావలేదని మాధవీలత అన్నారు.

పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ

పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ

పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం ఉన్నప్పుడు ఆయన స్థాపించిన జనసేన పార్టీకి ఎందుకు సపోర్ట్ చేయకూడదు అని మాధవీలత తెలిపారు. పవన్ కళ్యాణ్ కోసం దేనికైనా రెడీ అంటూ మాధవీలత చివరగా కామెంట్ పెట్టారు.

English summary
Madhavi latha sensational facebook post on Pawan Kalyan. She extends her support to Janasena
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X