»   »  కమల్ హాసన్ తో ముద్దు సీన్లపై మధుశాలిని వివరణ!

కమల్ హాసన్ తో ముద్దు సీన్లపై మధుశాలిని వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌, శ్రీగోకులం మూవీస్‌ పతాకాలపై రాజేష్‌ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘చీకటి రాజ్యం'. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో మధుశాలిని నటించింది. సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా కమల్ తో లిప్ లాక్ ముద్దు సీన్లు చుయడంతో హైలెట్ అయింది.

నటి మధుశాలిని చిత్రంలోని తన పాత్ర గురించి, తన పెర్‌ఫార్మెన్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ గురించి మాట్లాడారు. ఆడియన్స్‌ మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు నవంబర్‌ 20న విడుదలైన ఈ చిత్రానికి మీడియా ద్వారా చాలా పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ రావడం వల్ల సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్‌ చేస్తున్నారు. నేను నటించిన ఒక తెలుగు సినిమాలో నా క్యారెక్టర్‌కి ఇంత మంచి ఫీడ్‌ బ్యాక్‌ రావడం ఇదే ఫస్ట్‌ టైమ్‌. కమల్‌హాసన్‌గారు చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో ఒక స్ట్రెయిట్‌ మూవీ చేశారు. తెలుగు ప్రేక్షకులు ఆయన్ని చాలా బాగా రిసీవ్‌ చేసుకున్నారు. డైరెక్టర్‌ రాజేష్‌గారు కమల్‌హాసన్‌గారితో ఏడు సంవత్సరాలు ట్రావెల్‌ చేశారు. డైరెక్టర్‌గా ఆయనకిది మొదటి సినిమా. ఈ సినిమాతో డైరెక్టర్‌గా తనను తాను ప్రూవ్‌ చేసుకున్నారు రాజేష్‌గారు. ఇలాంటి మంచి సినిమాలు ఆయన ఇంకా ఎన్నో చెయ్యాలి, నాకు కూడా మంచి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

Madhu Shalini about Cheekati Rajyam kiss Scene

ఈ సినిమాలో పాటలు అనేవి లేకపోయినా మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమా అంతా చాలా గ్రిప్పింగ్‌గా వుంది. మంచి సినిమా ఏదైనా మనం ఆదరిస్తాం. ఈ సినిమా ఒక డిఫరెంట్‌ జోనర్‌లో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌. అది అందరికీ కన్విన్సింగ్‌గానే అనిపించింది ఈ సినిమాలో కమల్‌హాసన్‌గారితో ముద్దు సీన్‌లో నటించాను. సాధారణంగా ప్రతి సినిమాలో కిస్‌ అంటే అది ఒక రొమాంటిక్‌ సీన్‌లో చూపిస్తుంటారు. కానీ, ఈ సినిమాలో కమల్‌గారిని ముద్దు పెట్టుకోవడం అనేది కథకి అవసరం. ఆయన సినిమాల్లో ఏదైనా కథతోనే వెళ్తుంది. ఏ సీన్‌ అయినా కథలో వుండాలి కాబట్టే పెడతారు. సినిమా చూసిన వాళ్ళందరికీ కమల్‌గారితో ముద్దు సీన్‌ కన్విన్సింగ్‌గానే అనిపించింది. దీన్ని ఎవరూ పిన్‌పాయింట్‌ చేయలేదు. అప్పుడు ఆ క్యారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌ తెలిసింది.

కమల్‌హాసన్‌గారంటే నాకు చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాను. ఒక సినిమాకి ఆడిషన్స్‌ చేస్తున్నారని నా ఫ్రెండ్‌, హీరోయిన్‌ ప్రియా ఆనంద్‌ చెప్పింది. కమల్‌గారు చాలా మంది అమ్మాయిల్ని చూశారు. పర్టిక్యులర్‌గా నన్నే ఎందుకు సెలెక్ట్‌ చేసుకున్నారంటే ఉత్తమ విలన్‌ సినిమాకి సంబంధించిన ప్రమో షన్స్‌ కోసం హైదరాబాద్‌ వచ్చినపుడు ఆయన్ని కలవడం జరిగింది. ఆయన వెంటనే తన సినిమాలో నన్ను తీసుకోవడానికి ఓకే చెప్పారు. అప్పుడు నాకు ఆ క్యారెక్టర్‌కి వున్న ఇంపార్టెన్స్‌ గురించి తెలిసింది.

కమల్‌గారితో నటించడం మర్చిపోలేని అనుభూతిని కలిగించింది కమల్‌గారు ఏదైనా చాలా ఈజీగా చేసేస్తుంటారు. కానీ, నాకు మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఆయన ఇప్పటికి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో చేసినప్పటికీ ఇదే తన మొదటి సినిమా అనే జీల్‌తో చేస్తారు. తన క్యారెక్టర్‌ గురించే కాకుండా సినిమాలో నటించే ఇతర క్యారెక్టర్స్‌ కూడా ఎంత ఔట్‌పుట్‌ ఇవ్వొచ్చు అనేది చెప్తూ మా అందరికీ చాలా హెల్ప్‌ఫుల్‌గా వున్నారు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను నటించడం అనేది ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని కలిగించింది.

తమిళ్‌, మలయాళంలో నెక్స్‌ట్‌ మూవీస్‌ నేను చేయబోయే నెక్స్‌ట్‌ మూవీస్‌ తమిళ్‌, మలయాళంలలో వున్నాయి. త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ, నాకు నచ్చిన క్యారెక్టర్‌ రాకపోవడం వల్ల చెయ్యలేకపోతున్నాను.

English summary
Actress Madhu Shalini about Cheekati Rajyam movie kiss Scene.
Please Wait while comments are loading...