»   » మధుశాలిని నటించిన కన్నడ సినిమా తెలుగులో ‘కల్పన గెస్ట్ హౌస్’!

మధుశాలిని నటించిన కన్నడ సినిమా తెలుగులో ‘కల్పన గెస్ట్ హౌస్’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో అవకాశాలు లేని పలువురు హీరోయిన్లు మన పక్కనే ఉన్న సినీ పరిశ్రమలకు దారి పడుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో ఒకరు తెలుగు భామ మధు శాలిని. అమ్మడుకు తెలుగులో అవకాశాలు పెద్దగా లేక పోవడంతో తమిళం, కన్నడ చిత్ర సీమల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

మధుశాలిని కన్నడలో నటించిన ఓ చిత్రం 'కల్పన గెస్ట్ హౌస్' అనే టైటిల్‌తో తెలుగులో విడుదల కాబోతోంది. కన్నడ హీరో వేణు కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో థ్రిల్లర్ మంజు ఒక ముఖ్య పాత్ర పోషించారు. సాధుకోకిల సంగీతం అందించారు. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ హారర్ మూవీ తెలుగులోనూ విజయవంతం అవుతుందని భావిస్తున్నారు.

తెలుగులో ఈచిత్రాన్ని శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక పిక్చర్స్ విడుదల చేస్తున్నారు. బ్బింగ్ పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. మరి మధు శాలిని తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు భయ పెడుతుందో చూడాలి.


English summary
Telugu actress Madhu Shalini got a break with her recent horror film in Kannada. Venu (Kannada) played as main lead in this project whereas Thriller Manju in a special role. Kumar is its director. Sadhu Kokila is its Music composer. And now, this film is making its way into Telugu with the title ‘Kalpana Guest House’ on the banner Sri Kanipaka Varasiddhi Vinayaka Pictures.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu