»   » ఎందుకనో మనోళ్లు పక్కన పెట్టేసారు

ఎందుకనో మనోళ్లు పక్కన పెట్టేసారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Madhubala Kannada remake version
హైదరాబాద్ : 'అంతకుముందు ఆ తర్వాత' చిత్రం తర్వాత మళ్లీ మధుబాల తెలుగులో కూడా కనపడలేదు. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని అనుకున్నా కానీ, ఎందుకో మధుబాలకు ఎటువంటి అవకాశం దొరకలేదు. తెలుగులో ఒక్కటీ బుక్ కాలేదు. అయితే తాజాగా కన్నడంలో నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ఎంపికైంది. తెలుగులో నదియా పోషించిన పాత్రను కన్నడంలో మధుబాల ఏ మేరకు న్యాయం చేస్తుందో చూడాల్సిందే.

అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మధుబాల ..ఇప్పుడు అత్తగా మారబోతోంది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ అత్తారింటికి దారేది కన్నడ వెర్షన్ లో అత్తగా ఆమె కనిపించి అలరించనుంది. తెలుగులో ఆ పాత్రను నదియా చేసింది. కన్నడంలో కిచ్చా సుదీప్ హీరోగా చేస్తున్నారు. అక్కడ రీసెంట్ గా మిర్చితో హిట్ కొట్టిన సుదీప్...ఈ చిత్రం కూడా తనకు ఘన విజయం ఇస్తుందని భావిస్తున్నాడు.

కన్నడంలోనూ ఆమెకు మంచి పేరే ఉంది. రవిచంద్రన్ సరసన పదిహేనేళ్ల క్రితం నటించిన 'అన్నయ్య' సినిమా అక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చింది. చాలా కాలం తర్వాత కన్నడంలో తిరిగి నటించబోతున్నందుకు ఆనందంగా ఉందని తెలిపింది మధుబాల.

పవన్‌కల్యాణ్, సమంత జంటగా త్రివిక్రమ్ రూపొందించిన 'అత్తారింటికి దారేది' సినిమా తెలుగులో నెంబర్‌వన్ గ్రాసర్‌గా నిలిచి, మునుపటి రికార్డులను తుడిచిపెట్టింది. ఆ సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా రీమేక్ అవుతోంది. నందకిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ముహూర్తం కొద్ది రోజుల క్రితమే బెంగళూరులో జరిగింది. హీరోయిన్ ఎంపిక పూర్తి కాకపోయినా తెలుగులో నదియా చేసిన పాత్రకు మధుబాలను ఎంపిక చేశారు. అంటే సుదీప్‌కు ఆమె అత్తగా కనిపించబోతోంది.

English summary

 Madhubala has been roped in for the Kannada remake version of Pawan Kalyan's Attarintiki Daredi. Madhubala is playing role that Nadiya played in the original version and Kiccha Sudeep is playing lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu