»   » మెగాఫ్యామిలీ సీక్రెట్ మనీ మిషన్...మగధీర..!

మెగాఫ్యామిలీ సీక్రెట్ మనీ మిషన్...మగధీర..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

'మగధీర' చిత్రం పేరుకు తెలుగు చిత్రమైనా, అది కేవలం తెలుగు నాట ప్రజలకే కాదు, అన్ని ప్రాంతాల వారికీ నచ్చే, అందరూ మెచ్చే చిత్రం. అందుకు తగ్గట్లే ఇప్పుడిది 'మావీరన్‌'గా తమిళం, మళయాలంలో వచ్చి ప్రభంజనం సష్టిస్తోంది. ఈ 'మావీరన్‌' చిత్రం కోసం తెర ముందు, తెర వెనుక ఎంతోమంది 'మావీరన్‌'లు (తమిళంలో మహావీరులు అని అర్ధం) పనిచేశారు. ఈ చిత్రానికి తెలుగులో అన్ని రకాల విజయాలూ లభించాయి. వసూళ్ళ వర్షంతో పాటు అవార్డులూ వచ్చాయి. కాగా, కళలోనూ, మంచి చిత్రాలను ఆస్వాదించడంలోనూ, ఆదరించడంలోనూ తమిళ ప్రజానీకం ఎప్పుడూ ముందుంటారు. కాబట్టి, ఇప్పటికే ఎంతో సాధించిన ఈ చిత్రాన్ని వారు మరింత ముందుకు తీసుకెళ్లారనే విషయం కలెక్షన్స్ బట్టె తెలుస్తోంది.

రామ్ చరణ్ తో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'మగధీర". రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించి తెలుగు చలన చిత్ర చరిత్రని తిరగరాసిన ఈ చిత్రం రీసెంట్ గా తమిళంలో 'మావీరన్"గా మళయాలంలో 'మధీర"గానూ విడుదలైన విషయం తెలిసిందే. 'మావీరన్" విడుదలైన నాలుగు వారాలకే తమిళంలో 55సెంటర్స్ లో విజయంతంగా ప్రదర్శింపప బడుతూ 5కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందట. అలాగే కేరళలో 'ధీర"గా విడుదలైన ఈ సినిమా నాలుగు వారాలకు 1కోటి ఇరవైలక్షలు కలెక్ట్ చేసిందట. ఈ విషయాలని ట్విట్టర్ లో అల్లు శిరీష్ పోస్ట్ చేసి ..'మగధీర" మూడు భాషల్లోనూ కనకవర్షం కురిపిస్తుండటంతో 'మగధీర"ని మనీ మిషన్ గా అభివర్ణిస్తున్నాడు..

English summary
Ram Charan - S S Rajamouli made 'Magadheera' made record breaking collections not just in Telugu but recently in Tamil as 'Maaveeran', in Malayalam as 'Dheera' is known to our readers. In Tamil just four weeks it has collected Rs.5 crores in just four weeks in 55 centers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu