»   » మరి మగవాళ్ళు చూడొచ్చా..?? జ్యోతిక కొత్త సినిమా ఆడవాళ్ళకి మాత్రమేనట

మరి మగవాళ్ళు చూడొచ్చా..?? జ్యోతిక కొత్త సినిమా ఆడవాళ్ళకి మాత్రమేనట

Posted By:
Subscribe to Filmibeat Telugu

సీనియ‌ర్ హీరోయిన్ జ్యోతిక కీలక పాత్రలో ఓ మహిళా ప్రధాన చిత్రం తెరకెక్కనుంది. జాతీయ అవార్డు గ్రహీత బ్రహ్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రానికి మగలిర్ మట్టుమ్(ఆడవాళ్ళకు మాత్రమే) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. గతంలో ఇదే పేరుతో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా కమల్‌హాసన్ ఓ సినిమాను నిర్మించారు. తాగా మూవీని జ్యోతిక భ‌ర్త సూర్య నిర్మించనున్నాడు.. ఈ చిత్రంలో భానుప్రియ, ఊర్వశి, శరణ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తరువాత కొన్నాళ్లపాటు కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇచ్చింది నటి జ్యోతిక. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో సెకెండ్ ఇన్నింగ్స్ గత ఏడాదే ప్రారంభించింది. అయితే హీరోయిన్ పాత్రలు కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ కథల్ని ఆమె ఎంపిక చేసుకుంటోంది. గత ఏడాది ఆమె 36 వాయిదినిలె అనే చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక... తద్వారా మరోసారి అభిమానులను అలరించారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి హీరోయిన్ ప్రధాన కథనే ఎంచుకుంది జ్యోతిక. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జ్యోతిక తాజా చిత్రం విశేషాలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచాడు హీరో సూర్య.

Magalir Mattum first look: Jyothika plays a documentary filmmaker

హీరోయిన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నాడు బ్రహ్మ. అతడు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. 2 డి ఎంటర్ టెయిన్మెంట్ పతాకంపై ఈ ప్రాజెక్ట్ జులై నుంచే ప్రారంభం అయ్యింది. సూర్య విడుదల చేసిన ఈ చిత్రం పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మొత్తమ్మీద మరో మంచి పాత్రను జ్యోతిక ఎంచుకుందనే చెప్పాలి. ఈ చిత్రంలో జ్యోతికతో పాటు శరణ్య - ఊర్వశి - భానుప్రియ - నాజర్ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాలో జర్నలిస్ట్ గా కనిపించనుంది జ్యోతిక.ఆడవారి సమస్యల మీద పోరాడే పాత్ర్కేయురాలిగా ఈ చిత్ర కథ సాగుతుందట. గ్లామర్ హీరోయిన్ గా చాలాకాలమే నిలబడ్డ జ్యోతిక ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో నటన ప్రధానం గా ఉన్న పాత్రలే చేయాలనుకుంటుందట.. అందుకే ఆచితూచి కథలని ఎంచుకుంటోందట. ఈ సినిమా కోసమే ఆ మధ్య బుల్లెట్ నడపటం కూడా నేర్చుకుంది. స్వయంగా సూర్యా నే టూవీలర్ ఎలా నడపాలో ట్రైనింగ్ ఇచ్చాడు కూడా.

English summary
Actress Jyotika’s next Tamil outing, in which she plays a documentary filmmaker, has been titled “Magalir Mattum”, and it has been borrowed from an eponymous yesteryear Tamil hit which was produced by Kamal Haasan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu