»   » బాహుబలి వర్సెస్ రామాయణం.. సంఘమిత్ర వర్సెస్ మహాభారతం.. దక్షిణాదిలో పోటాపోటీగా..

బాహుబలి వర్సెస్ రామాయణం.. సంఘమిత్ర వర్సెస్ మహాభారతం.. దక్షిణాదిలో పోటాపోటీగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమా విజయంతో భారీ చిత్రాల నిర్మాణంపై దక్షిణాదిలో నిర్మాతలు దృష్టిపెడుతున్నారనే విషయం రామాయణంతో స్పష్టమైంది. బాహుబలిని స్ఫూర్తిగా తీసుకొని రామాయణం అనే సినిమాకు రంగం సిద్ధమవుతున్నది. రామాయణం సినిమాను రూపొందిస్తున్నట్టు నిర్మాత అల్లు అరవింద్ అప్పడే ప్రకటన చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ మరింత క్యూరియాసిటిని పెంచింది. రాముడి అవతారంలో రాంచరణ్ గెటప్ మెగా అభిమానులను సంతోషంలో ముంచెత్తుతున్నది. కాగా తమిళంలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌తో సంఘమిత్ర, మలయాళంలో 1000 కోట్లతో మహాభారతాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అరవింద్ రామాయణం..

అరవింద్ రామాయణం..

ప్రపంచవ్యాప్తంగా ఆదరణతోపాటు రూ.1000 కోట్లకుపైగా కలెక్షన్లను సాధిస్తున్న బాహుబలి2 చిత్రం ఇప్పడు టాలీవుడ్ నిర్మాతలకు స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఆ నేపథ్యంలోనే రామాయణాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మించేందుకు అల్లు అరవింద్ భారీ ప్రణాళికను సిద్దం చేశారు. రాజమౌళి త్వరలోనే మహాభారతాన్ని తీస్తున్నారనే వార్తల నేపథ్యంలో రామాయణం చిత్రం ఒక్కసారిగా తెరపైకి రావడం గమనార్హం. దక్షిణాదిలో రోబో2, 1000 కోట్లతో మహాభారతం,

 నిర్మాణంలో వర్మ మేనల్లుడు..

నిర్మాణంలో వర్మ మేనల్లుడు..

రామాయణం నిర్మాణ సారథ్యంలో అల్లు అరవింద్‌తోపాటు మధు మంతెన, నమిత్ మల్హోత్రా చేతులు కలిపారు. మధు మంతెన దర్శకుడు రాంగోపాల్ వర్మకు మేనల్లుడు. గతంలో అల్లు అరవింద్ హిందీలో నిర్మించిన గజనీ సినిమాకు ఆయన ప్రొడక్షన్ బాధ్యతలు చూశారు.

 500 కోట్లు.. 2డీ, 3డీ వెర్షన్...

500 కోట్లు.. 2డీ, 3డీ వెర్షన్...

రూ.500 కోట్లతో ఈ చిత్రాన్ని 2డీ, 3డీ వెర్షన్‌లో రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధమైనట్టు సమాచారం. వెండితెరపై రామాయణం కనిపించి చాలా రోజులే అయింది. గతంలో టెలివిజన్ సీరియల్‌గా వచ్చిన రామాయణం దేశవ్యాప్తంగా ఆదరణను చూరగొన్నది. మళ్లీ బిగ్ స్క్రీన్ మీదకు రామాయణం వస్తే మంచి ఆదరణ లభించడం ఖాయమనే మాట వ్యక్తమవుతున్నది.

నవంబర్‌లో సెట్స్ పైకి..

నవంబర్‌లో సెట్స్ పైకి..

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇంకా ఈ చిత్రానికి దర్శకుడు గానీ, నటులు గానీ, టెక్నీషియన్లుగానీ ఖారారు కాలేదు. ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రెండు లేదా మూడు భాగాలుగా తీసే అవకాశం ఉంది.

దక్షిణాదిలో

దక్షిణాదిలో

దక్షిణాదిలో ఇప్పటికే మరో భారీ బడ్జెట్ సినిమా రోబో2 సిద్ధమవుతున్నది. లేటేస్ట్ టెక్నాలజీతో సంచలన దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రజనీకాంత్, శంకర్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా మారింది. అంతేకాకుండా సంఘమిత్ర చిత్రం కూడా రెడీ అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమాన్ని గురువారం 70వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఆర్ రెహ్మాన్, శృతిహాసన్, ఆర్య, పీసీ సుందరం తదితరులు హాజరయ్యారు.

మలయాళం

మలయాళం

ఇక మలయాళంలో రూ.1000 కోట్ల బడ్జెట్‌తో మహాభారతం రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ భీముడి పాత్రను పోషిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం.

English summary
South Film Industry is now centre of attraction in Indian film Industry. Baahubali proved south potential to world cinema. From the inspiration of Baahubali, There few films like Sangamitra, Mahabharat, Ramayanam are going to hit big budget.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu