»   » ముగిసిన ‘మహానటి’ షూటింగ్: కీర్తి సురేష్ ఎమోషనల్ ట్వీట్, కంటతడి!

ముగిసిన ‘మహానటి’ షూటింగ్: కీర్తి సురేష్ ఎమోషనల్ ట్వీట్, కంటతడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Keethi Suresh Talks About Her movie

ప్రముఖ నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'మహానటి' షూటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా ఇందులో టైటిల్ రోల్ చేస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు స్పందించారు. షూటింగ్ ముగిసిన అనంతరం గుమ్మడికాయ కొట్టాక సావిత్రి చిత్ర పటం వద్ద కీర్తి సురేష్ కంటతడి పెట్టారు.

గర్వపడే సినిమా అవుతుందన్న కీర్తి సురేష్

సంవత్సరకాలంగా ఒక అద్భుతమైన ప్రయాణం సాగింది. అది ఈ రోజు ముగిసింది. ఎమోషనల్‌గా నా మనసుకు ఎంతో బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చి దర్శకుడు నాగఅశ్విన్, వైజయంతి మూవీస్ వారికి బిగ్ థాంక్స్. ఈ చిత్రం మేము గర్వపడే సినిమా అవుతుంది. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నాను... అని కీర్తి సురేష్ ట్వీట్ చేశారు.

గొప్ప సినిమాటిక్ అనుభవం ఇస్తుంది

గొప్ప సినిమాటిక్ అనుభవం ఇస్తుంది

చిత్ర నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ... ‘మహానటి' లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. తమ టీం క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించామన్నారు.

ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు

ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశారు

కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన నాగచైతన్యకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రియాంక అన్నారు. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది అన్నారు.

 జర్నలిస్టు మధురవాణిగా సమంత

జర్నలిస్టు మధురవాణిగా సమంత

సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో ‘మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.

 మే 9న గ్రాండ్ రిలీజ్

మే 9న గ్రాండ్ రిలీజ్

మే 9న తెలుగు, త‌మిళ భాష‌ల‌లో మ‌హాన‌టి చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త‌మిళంలో ‘నడిగర్‌ తిలగమ్‌' అనే టైటిల్ తో ఈ మూవీ విడుద‌ల కానుంది. సి. అశ్వినీదత్ సమర్పణలో వైజ‌యంతి సినిమా పతాకంపై స్వప్నా దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జేయ‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

English summary
Mahanati shooting completed. "An incredible journey of over an year, gets completed today. I feel emotionally taken aback. Big thanks to nagashwin7 & VyjayanthiFilms for their trust in me. We all have something proud to look back. Can’t wait to get her at the theatres" Keerthy Suresh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X