»   » పార్టీలో మునిగి తేలిన కీర్తీ సురేష్, మహానటి టీం (ఫోటోస్)

పార్టీలో మునిగి తేలిన కీర్తీ సురేష్, మహానటి టీం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahanati Team Wrap Up Party : PICS

సినిమా షూటింగ్ ముగియగానే యూనిట్ సభ్యులంతా పార్టీ చేసుకోవడం సర్వసాధారణం. దాదాపు సంవత్సర కాలం పాటు సాగిన షూటింగ్ ఎట్టకేలకు ముగియడంతో 'మహానటి' టీం కూడి చిన్నపార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలొ దర్శక నిర్మాతలతో పాటు ప్రధాన పాత్రధారి కీర్తి సురేష్ కూడా ఆనందంతో చిందులేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఇంకా కొంత పని మిగిలే ఉంది

ఇంకా కొంత పని మిగిలే ఉంది

‘మహానటి' చిత్రానికి సంబంధించి షూటింగ్ పార్టు మాత్రమే పూర్తయింది. సినిమాకు సంబంధించిన కొంత గ్రాఫిక్ వర్క్ పెండింగులోనే ఉందట. వీలైనంత త్వరగా పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి మే 9న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

గర్వపడే సినిమా అవుతుందన్న కీర్తి

గర్వపడే సినిమా అవుతుందన్న కీర్తి

సంవత్సరకాలంగా ఒక అద్భుతమైన ప్రయాణం సాగింది. అది ఈ రోజు ముగిసింది. ఎమోషనల్‌గా నా మనసుకు ఎంతో బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. నా మీద నమ్మకంతో నాకు ఈ పాత్ర ఇచ్చి దర్శకుడు నాగఅశ్విన్, వైజయంతి మూవీస్ వారికి బిగ్ థాంక్స్. ఈ చిత్రం మేము గర్వపడే సినిమా అవుతుంది. ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్నాను... అని కీర్తి సురేష్ ట్వీట్ చేశారు.

జర్నలిస్టు మధురవాణిగా సమంత

జర్నలిస్టు మధురవాణిగా సమంత

సమంత ఇందులో ఫిల్మ్ జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో కనిపించబోతున్నారు. సావిత్రి మీద జర్నల్ రాసే జర్నలిస్టుగా సమంత నేరేషన్‌తో ‘మహానటి' చిత్రం మొదలవుతుందని టాక్. ఆమె తన జర్నల్ గురించి చెప్పే క్రమంలోనే సినిమా రన్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.

కీలకపాత్రల్లో

కీలకపాత్రల్లో

చిత్ర నిర్మాత ప్రియాంక దత్ మాట్లాడుతూ... ‘మహానటి' టీం క్రియేట్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఎరా ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందని చెప్పారు.
కీర్తి సురేష్, సమంత, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, షాలిని పాండే, మాళవిక నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ వంటి వారితో కలిసి ఈ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించిన నాగచైతన్యకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ప్రియాంక అన్నారు. మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ ఇచ్చిన సపోర్ట్ మరిచిపోలేనిది అన్నారు.

English summary
Savithri's Biopic Movie #Mahanati Shooting Has Been Wrapped Up. Some of the graphics works for the Mahanati movie is still in pending. Once it is completed the team will start the post production works. They have already given the clarity that the movie will hit the theatres on May 9.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X