twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    37 భాషల్లో విడుదలవుతున్న తొలి ఇండియన్ సినిమా ఇదే!

    By Bojja Kumar
    |

    'బాహుబలి' ప్రాజెక్టు వచ్చే వరకు ఇండియాలో అంత భారీ స్థాయిలో తెరకెక్కిన సినిమా లేదు. అసలు ఆ సినిమా వచ్చే వరకు ఇండియన్ సినిమా చరిత్రలో రూ. 1000 కోట్లు వసూలు చేసిన దమ్మున్న చిత్ర రాజమే లేదు. బాహుబలి-2 విడుదలైన తర్వాతే మన సినిమా రూ. 2000 కోట్లు వసూలు చేయగలదు అనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది. విదేశీ చిత్ర నిర్మాణ సంస్థలు కూడా ఇండియన్ సినిమా మార్కెట్ మీద దృష్టి సారించేలా చేశాయి.

    Recommended Video

    బాహుబలి తరహా మరో భారీ సినిమా.. హీరో ఎవరో తెలుసా?
     మహావీర్ కర్ణ

    మహావీర్ కర్ణ

    ఇండియన్ సినీ పరిశ్రమలో మరో భారీ చిత్రం రాబోతోంది. బడ్జెట్ రూ. 300 కోట్లతో ఎపిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్క నుంది. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ‘మహావీర్ కర్ణ' పేరుతో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు.

     37 భాషల్లో విడుదల

    37 భాషల్లో విడుదల

    ‘మహావీర్ కర్ణ' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 37 భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మలయాళ దర్శకుడు ఆర్.ఎస్.విమల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

     డబ్బు కోసం కాదు...

    డబ్బు కోసం కాదు...

    ‘మహావీర్ కర్ణ' చిత్రాన్ని వ్యాపార దృక్ఫథంతో తీయడం లేదని, 37 భాషల్లో సినిమాను విడుదల చేయడానికి కారణం కర్ణుడి చరిత్ర ప్రపంచం మొత్తం తెలియాలనే ఉద్దేశ్యంతోనే అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విక్రమ్ తెలిపారు.

     ‘బెన్‌హర్' స్థాయిలో

    ‘బెన్‌హర్' స్థాయిలో

    హాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హిట్ మూవీ ‘బెన్ హర్' స్థాయిలో ‘మహావీర్ కర్ణ' చిత్రం ఉండబోతోందని...‘బెన్ హర్' చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించినట్లే ‘మహావీర్ కర్ణ' చిత్రాని ప్రపంచ ప్రేక్షకులను ఆదరిస్తారనే నమ్మంతోనే తీస్తున్నామని విక్రమ్ తెలిపారు.

    షూటింగ్ ఎప్పటి నుండి?

    షూటింగ్ ఎప్పటి నుండి?

    ఈ చిత్ర షూటింగ్ అక్టబోర్ 2018 నుండి మొదలు కాబాతోంది. డిసెంబర్ 2019లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

    English summary
    Big-budgeted fantasy film is going to be made by Malayalam director R S Vimal with the title Mahaveer Karna. The film is going to be released in Hindi, Telugu, Tamil and Malayalam languages. The film that is going to be made with a budget of 300 crores is said to be having a rand release in almost 37 languages in the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X