»   » మురుగ దాస్ ట్వీట్ కే మురిసిపోతున్న మహేష్ అభిమానులు..., ఇక అదే నిజమైతే..?

మురుగ దాస్ ట్వీట్ కే మురిసిపోతున్న మహేష్ అభిమానులు..., ఇక అదే నిజమైతే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బ్రహ్మోత్సవం సినిమా తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌కే మొగ్గు చూపుతూ వ‌స్తోన్న మ‌హేష్ మురుగదాస్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇదందరికీ తెలిసిన సంగతే కదా....

ఈ మూవీ టైటిల్ ఖరారైందంటూ గతంలో వాస్కోడిగామా, ఎనీమీ, అభిమ‌న్యుడు, ఏజెంట్ శివ, ఏజెంట్ 007...ఇలా రకరకాల టైటిల్స్ ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. ఏజెంట్ శివ టైటిల్ దాదాపు క‌న్ ఫ‌ర్మ్ అయిందని.. ఈ టైటిలే త్వ‌ర‌లో అఫీషియల్ గా ఎనౌన్స్ చేయ‌నున్నారని ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. మ‌హేష్ బాబు - మురుగుదాస్ ల మూవీ కోసం ఫిల్మ్ ఛాంబ‌ర్ లో సంభ‌వామి అనే టైటిల్ రిజిస్టర్ చేసిన‌ట్టు వార్తలు వచ్చినా పక్కగా ఎవరూ ఇదే టైటిల్ అంటూ ఇంకా చెప్పకపోవటం అభిమానుల్లో కొంత గందరగోళానికి కారణమయ్యింది.

 maheash baabu fan's happy with Muruga Das's Tweet

ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న 100 కోట్ల సినిమా టైటిల్ పై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో అయోమయంలో పడిన మహేష్ అభిమానులు కాస్త నిరాశగానే ఉన్నారు. అయితే ఆ నిరాశలోంచి తాజా ట్వీట్ బయట పడేసినట్టే ఉంది మనోళ్ళని. మహేష్ నూతన సంవత్సర సందర్భంగా మురగదాస్ కు ఆ సినిమా యూనిట్ సభ్యులకు న్యూఇయర్ గ్రీటింగ్స్ చెపుతూ ట్విట్ చేసాడు. దానికి కృతజ్ఞతలు చెపుతూ మురగదాస్ 'బ్లాక్ బస్టర్' ఆన్ ది వే' అంటూ రిప్లయ్ ట్విట్ పెట్టాడు.

ఈ ట్విట్ ను చూసిన మహేష్ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోవడమే కాకుండా మహేష్ నుంచి త్వరలో తాము ఒక బ్లాక్ బస్టర్ ను చూడబోతున్నాము అన్న ఆనందంలోకి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం విడుదల కాబోతున్న అత్యంత ఆసక్తి దాయకమైన సినిమాల లిస్టులో టాప్ 5 స్థానం పొందిన ఈ సినిమా పై ఉన్న అంచనాలు తెలిసినవే.

 maheash baabu fan's happy with Muruga Das's Tweet

ఈ ఏడాది సమ్మర్ రేస్ కు రాబోతున్న ఈసినిమా రికార్డులను సృష్టిస్తుందని మహేష్ అభిమానులు కలలు కంటున్నారు. కనీసం రాబోతున్న సంక్రాంతికి అయినా ఈసినిమా టైటిల్ విషయమై ఒక క్లారిటీకి వచ్చి ఈసినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్లు విడుదల కావాలని కొండంత ఆశలో ఉన్న మహేష్ అభిమానుల కోరికను మురగ దాస్ ఎప్పుడు తీరుస్తాడో చూడాలి..

English summary
Thank you so much sir... Happy new year.. Blockbuster on the way..! murugadas Replayd to Mahesh's Tweet on New year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu