»   » మహేష్ బాబు స్టామినా నిరూపించిన గుంటూరు రైట్స్

మహేష్ బాబు స్టామినా నిరూపించిన గుంటూరు రైట్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన '1'(నేనొక్కడినే) చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 4 కోట్లు అమ్ముడయినట్లు తెలుస్తోంది. 'ఎస్ క్రియేషన్స్' అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్ఆర్ఏ పద్దతిలో ఈచిత్రం రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఈ ఏరియాలో పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం అత్యధికంగా రూ. 4.05 కోట్లకు అమ్ముడయింది. ఇప్పుడు మహేష్ బాబు '1' చిత్రం కూడా అందుకు ఏ మాత్రం తీసిపోకుండా చిన్న పాటి తేడాతో అమ్ముడవటం...చూస్తుంటే ఈ ఇద్దరు హీరోల సినిమాలకు ఇక్కడ ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.

mahesh babu

ఇందులో మహేష్ బాబు సరసన క్రితి సానన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 4 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుని మరింత యంగ్ లుక్‌లోకి మారారు.

'1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెర తెరంగ్రేటం చేయబోతున్నాడు. ఇప్పటికే గౌతంపై పలు సీన్లను చిత్రీకరించారు. చిన్నతంలోని మహేష్ పాత్రలో గౌతం కనిపించనున్నాడు. డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది.

సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Mahesh Babu new movie “1-Nenokkadine” mvie Guntur area distribution rights have been sold for fancy price. As per the reports coming in, the movie has fetched 4 crores for Guntur area. Earlier, Pawan kalyan Atharintiki Daredi has fetched 4.05 crores for Guntur area distribution rights.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu