»   » క్లారిటి కోసమే మహేష్ ఆగాడట

క్లారిటి కోసమే మహేష్ ఆగాడట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మణిరత్నం లాంటి స్టార్ డైరక్టర్ వచ్చి నీతో సినిమా చేస్తాను అంటే మహేష్ చేయనన్నాడా అనేదే గత కొంత కాలంగా సినిమావాళ్ళలో,అభిమానుల్లో కలుగుతున్న ప్రశ్న. ఎందుకంటే మణిరత్నంతో అనుకున్న ప్రాజెక్టు లేనట్లే అని అంతటా వార్తలు వచ్చేసాయి. మహేష్ సైతం వేరే ప్రాజెక్టులలో బిజీ అయిపోతున్నాడు. ఈ నేపధ్యంలో మహేష్ మళ్లీ మణిరత్నం చిత్రం ఉంది అని మీడియాకు చెప్పాడు.

పాపులర్ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ మహేష్... 'మణిరత్నంతో చేయాలనుకున్న సినిమా ఆగిపోలేదు. నేను పలు సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల నా డేట్స్ కుదరలేదు. ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అది రాగానే అధికారిక ప్రకటన చేస్తాను' అని మహేష్ బాబు అన్నాడు.

Mahesh about Mani Ratnam movie

మహేష్ బాబు మాట్లాడుతూ... " మేము టీజర్ లో ఎవరినీ టార్గెట్ చేయలేదు. అలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. నేను కూడూ దూకుడు లో అలాంటి పంచ్ డైలాగులే చెప్పాను. ఆగడు లో ఈ డైలాగు అక్కడ నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ డైలాగు కేవలం ఆ పాత్ర ఏటిట్యూట్ మాత్రమే. వేరే వారి గురించి అన్న ప్రశ్నే లేదు ," అని తేల్చి చెప్పారు.

ఇంతకీ టీజర్ లో చెప్పిన ఆ పంచ్ డైలాగులు ఏమిటంటే... ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Mahesh said ..." And the film with Mani Ratnam might still work. I have my hands full with my current commitments. As of now, all I can say is that we are still in talks," he said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu