»   » లాగ్ ఆఫ్, షట్ డౌన్ చేసి అంతా పరుగెట్టండి : మహేష్ బాబు

లాగ్ ఆఫ్, షట్ డౌన్ చేసి అంతా పరుగెట్టండి : మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఎయిర్ టెల్ సంస్ధ నిర్వహించనున్న మారధాన్ లో పాల్గొనమని హీరో మహేష్ బాబు పిలుపు ఇచ్చారు. గత సంవత్సరం కూడా ఈ మారధాన్ జరిగింది. అప్పుడు దాదాపు పది వేల మంది పాల్గొన్నారు. జంట నగరాల ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించే లక్ష్యంతో ఎయిర్ టెల్ సంస్ధ ఈ మారధాన్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ రన్నర్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ముంబై మారధాన్ తర్వాత దేశంలోనే అతి పెద్ద మారధాన్ గా హైదరాబాద్ మారధాన్ కు పేరు ఉంది. ఈ విషయమై మహేష్ ఈ క్రింద విధంగా ట్వీట్ చేసారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


అలాగే...ట్వీట్ ని కంటిన్యూ చేస్తూ..మారధాన్ లో పాల్గొనటానికి రిజిస్టర్ చేసుకోవాల్సిన చివరి తేదిని చెప్తూ...ఇక మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు విషయానికి వస్తే...


మహేష్ బాబు, శ్రుతిహాసన్‌ జంటగా మిర్చి ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్రీమంతుడు'. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్‌ లేకుండా క్లీన్‌ యూ బై ఏ ధ్రువీకరణ పత్రం పొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 7న శ్రీమంతుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు


కుటుంబ సమేతంగా వీక్షించేలా చక్కటి కథ, కథనాలతో దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.


చిత్రం గురించి కొరటాల శివ మాట్లాడుతూ... అతను అపర శ్రీమంతుడు. ధనంలో... గుణంలోను. జీవుడల్లె పుట్టి.. ఆ వూరికి దేవుడల్లె వచ్చాడు. స్నేహానికి నిర్వచనంలా, త్యాగానికి చిరునామాలా కనిపిస్తాడు. ఇక అతని అందం గురించి ఏమని చెప్పాలి? అతని నవ్వు.. ప్రేమకు చిహ్నంలా ఆకర్షిస్తుంది.


Mahesh asks everyone to RUN at Hyderabad marathon

కాముడు రాసిన గ్లామర్‌ డిక్షనరీలా చటుక్కున ఆకట్టుకొంటాడు. అలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ప్రేమించకుండా ఉంటుందా? ఓ అమ్మాయి కూడా మనసిచ్చేసింది. మరి ఆ ఇద్దరి వలపుల ప్రయాణం ఏ రీతిన సాగిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కొరటాల శివ.


దర్శకుడు కొరటాల శివ కంటిన్యూ చేస్తూ.. ...''మహేష్‌ లాంటి ఓ గొప్ప నటుడితో సినిమా చేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం. మహేష్‌ ఇమేజ్‌కి నాలుగు ఫైట్లు, పాటలు ఉంటే సరిపోదు. ఒక పెద్ద కాన్వాస్‌లో కథ ఉండాలని కష్టపడి రాశా. మహేష్‌గారికి చెప్పినప్పుడు 'ఈ కథని ఇంత కమర్షియల్‌గా చెప్పొచ్చా?' అని ఆశ్చర్యపోయారు. మహేష్‌తో ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. మహేష్‌, జగపతిబాబు తండ్రీకొడుకులుగా బాగా కుదిరారు''అన్నారు.


నిర్మాతలు నవీన్‌ యర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ మాట్లాడుతూ ''ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. మాస్‌, క్లాస్‌ తేడా లేకుండా పాటలు అందరినీ ఆకట్టుకొంటున్నాయి. అభిమానుల అంచనాలను అందుకొనేలా ఈ చిత్రాన్ని రూపొందించాం. మహేష్‌ నటించిన చిత్రాలు తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టాయి. 'శ్రీమంతుడు'ని తమిళంలో 'సెల్వందన్‌' పేరుతో విడుదల చేస్తున్నాము''అన్నారు.


శ్రుతి హాసన్‌ మాట్లాడుతూ... ''ఇలాంటి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని పాత్ర పోషించాను''అన్నారు.


జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, ముఖేష్‌ రుషి, తులసి, సుకన్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, ఛాయాగ్రహణం: మది


English summary
"Log off. Shut down. Run. Join thousands and participate in the Hyderabad marathon on the 30th of August", said Mahesh Babu.
Please Wait while comments are loading...