క్రేజీ కాంబినేషన్లో మహేష్ బాబు 25వ మూవీ
క్రేజీ కాంబినేషన్లో మహేష్ బాబు 25వ మూవీ
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు పెద్ద నిర్మాతలు సంయుక్తంగా మహేష్ బాబు సినిమాను నిర్మించబోతుండటం ఆసక్తి కరంగా మారింది. 2017లో ప్రారంభం కాబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. 'ఊపిరి' లాంటి హిట్ చిత్రాలను నిర్మించిన వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ మూవీ. ఈ సినిమా పివిపి చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే అనుకోని కారణాలతో ఈ చిత్రం అశ్వినీ దత్, దిల్ రాజు చేతుల్లోకి వెళ్లింది.


Click it and Unblock the Notifications











