»   » అదిరిపోలా: 'ఆగడు' సెట్స్ పై మహేష్ (కొత్త ఫొటోలు)

అదిరిపోలా: 'ఆగడు' సెట్స్ పై మహేష్ (కొత్త ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆగడు'. ఈ చిత్రం షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లారు మహేష్. అక్కడ కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం సెట్స్ పై తీసుకున్న ఫొటోలు ఇవి. ఈ ఫొటోలల్లో మహేష్ ని చూసిన అభిమానులు ఆనందోత్సాహాల్లో తేలుతున్నారు.

ఇక ముంబై షెడ్యూలు తర్వాత కేరళ వెళ్లనున్నారు. ముంబై షెడ్యూలు 15 రోజులు పాటు జరగనుంది. కేరళలలో కొన్ని కీలకమైన లవ్ సీన్స్ తీయనున్నారని సమాచారం. అక్కడ అందమైన లొకేషన్స్ లో ఈ సీన్స్ ప్లాన్ చేసారని సమాచారం. తమన్నా హీరోయిన్ . 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

కృష్ణ పుట్టినరోజు సందర్భంగా 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్‌ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్‌ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్‌ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్‌ మొత్తం హుషారుగా సాగిపోయింది.

స్లైడ్ షోలో ఆ ఫోటోలు.....

పంచ్ కే పంచ్

పంచ్ కే పంచ్

పంచ్‌ డైలాగు లేకపోతే.. టీజర్‌, ట్రైలర్‌ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్‌ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్‌ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో.

ఆడియో విడుదల

ఆడియో విడుదల

మహేష్‌ జన్మదినమైన ఆగస్టు 9న పాటలను విడుదల చేసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు.

ఎక్కువ శ్రద్ద

ఎక్కువ శ్రద్ద

ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన 1 , నేనొక్కడినే చిత్రం డిజాస్టర్ కావటం కూడా ఆయన్ను ఈ ప్రాజెక్టుపై ఎక్కువ కాన్సర్టేట్ చేసేలా చేస్తోంది

విడుదల తేదీ

విడుదల తేదీ

దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా

ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా

'ఆగడు'లో ఆయన ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నట్టు సమాచారం. పోలీస్ డ్రస్ ఆయనకు కలిసిరావటం తెలిసిన విషయమే

ఎవరెవరు...

ఎవరెవరు...

డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

English summary
Mahesh Babu's Aagadu team recently shifted to Mumbai for their current schedule. Prince Mahesh Babu is shooting some action sequences in Mumbai and the team will head to Kerala after this. The Mumbai schedule will continue for 15 days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu