»   »  మళ్లీ 'బళ్లారి బాబు ' గా మహేష్ బాబు

మళ్లీ 'బళ్లారి బాబు ' గా మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడులో బళ్లారి బాబు ఎపిసోడ్ గుర్తుండే ఉంటుంది. మళ్లీ అలాంటి మ్యాజిక్ ని సెంటిమెంట్ గా రిపీట్ చేయటానికి శ్రీనువైట్ల ప్రయత్నిస్తున్నట్లే కనపడుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న 'ఆగడు' చిత్రం షూటింగ్ ఈ నెల 23 నుంచి బళ్లారిలో తీయటానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడో పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయనున్నారు. 20 రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఇక 'పోకిరి' తర్వాత పవర్‌ఫుల్‌ పోలీసు అధికారిగా మహేష్‌బాబు కనిపించబోతున్న చిత్రం 'ఆగడు'. తమన్నా హీరోయిన్. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతోంది. చిత్ర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 18వరకు ఇక్కడే చిత్రీకరణ ఉంటుంది. 23 నుంచి బళ్లారిలో తెరకెక్కిస్తారు.

నిర్మాత మాట్లాడుతూ... ''దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రమిది. దానికి మించి వినోదం పండేలా దర్శకుడు ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. మహేష్‌ పాత్ర చిత్రణ అభిమానులకు, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది''అంటున్నారు. పాటల్ని కృష్ణ జన్మదినం సందర్భంగా మే 31న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu ‘Aagadu’ shooting is in a brisk pace. Presently the film shooting is being shot in Annapurna Studios and the film unit plans to shot some scenes in Bellary from 23 rd of this month.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu