»   »  అభిమానులు సిద్ధంగా ఉండండి: మహేష్ బాబు

అభిమానులు సిద్ధంగా ఉండండి: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''2013ని మర్చిపోలేను. గత రెండేళ్ల నుంచీ సంక్రాంతికి నా సినిమాలొస్తున్నాయి. 'బిజినెస్‌మేన్‌', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించారు. ఈసారీ పండగ '1'తో మొదలవబోతోంది. అభిమానులు సిద్ధంగా ఉండండి. థియేటర్ల దగ్గర పండగ చేసుకొందాం. 2014లో కనీసం రెండు సినిమాలైనా సిద్ధం చేయాలన్నది నా ఆలోచన. కొత్త యేడాది సంబరాలు ఇంటి దగ్గరే చేసుకొంటా'' అన్నారు మహేష్ బాబు.

ఇక మహేష్ బాబు '1 నెనొక్కడినే' సినిమా సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రానుంది. 'దూకుడు' చిత్రం తరువాత మహేష్ బాబు హీరోగా 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. సంస్థ సుకుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున్న '1' నేనొక్కడినే.. చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా గురించి వారు వివరిస్తూ - 'ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ముందు ప్రకటించిన విధంగానే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 10న విడుదల చేస్తాం' అన్నారు. 'ఆడియో పెద్ద హిట్ అయింది.

దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. మహేశ్ తనయుడు గౌతమ్ చిన్నప్పటి మహేశ్‌గా నటించడం ఈ చిత్రానికి ఒక హైలైట్ పాయింట్. మా బేనర్‌లో ఇది మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది' వారన్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఫొటోగ్రఫీ: ఆర్.రత్నవేలు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కోటి పరుచూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.

English summary
Mahesh Babu's 1 Nenokkadine film will be released on January 10 during Sankaranthi festival.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu