twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో మహేష్ బాబు చాలా కఠినం.. గౌతమ్, సితారపై ఆంక్షలు!

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత అన్యోన్య దాంపత్యం సాగిస్తూ తెలుగు సినిమా పరిశ్రమలో ఆదర్శ దంపుతులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం భార్య భర్తలుగా మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు పర్పెక్టుగా నిర్వర్తిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

    తమ బిజీ షెడ్యూల్‌లో సైతం పిల్లలతో గడపటానికి సమయం కేటాయించడంతో పాటు వారు ఏం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లు అలవరచుకుంటున్నారు అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. పిల్లలకు సంబంధించిన విషయాల్లో మహేష్ బాబు చాలా స్ట్రిక్టుగా ఉంటారట.

    మహర్షి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 'రంగస్థలం'తో పాటు నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢమాల్మహర్షి ఫస్ట్ వీక్ కలెక్షన్స్: 'రంగస్థలం'తో పాటు నాన్ బాహుబలి రికార్డులన్నీ ఢమాల్

    Mahesh Babu about childrens video game adiction

    ఈ రోజుల్లో పిల్లలంతా మొబైల్ ఫోన్లో గేమ్స్‌ ఆడటానికి అడిక్ట్ అవుతున్నారు. పిల్లలు మాత్రమే కాదు పెద్దలకు సైతం ఇదో వ్యసనంగా మారుతోంది. మహేష్-నమ్రత పిల్లలు గౌతమ్, సితార కూడా మొబైల్ ఫోన్ గేమ్స్ అంటే చాలా ఇష్టపడతారు. అయితే వారిని వాటికి దూరంగా ఉంచకుండా ప్రతిరోజూ ఒక గంట మాత్రమే ఆడుకునేలా ఆంక్షలు పెట్టారట.

    మహేష్ బాబు మాట్లాడుతూ... 'ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ గేమ్స్ ఆడటం అనేది ఒక పిచ్చిగా మారుతోంది. పిల్లలు వాటికి అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. వారిని మొత్తానికే దూరం ఉంచడం కాకుండా ఒక నిర్ణీత సమయంలో మాత్రమే ఆడుకునేలా సమయం కేటాయించాలి. మా ఇద్దరు పిల్లలు సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఒక గంట మాత్రమే వీడియో గేమ్ ఆడుకునేలా రూల్ పెట్టాము' అని తెలిపారు.

    మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన నటించిన 25వ చిత్రం 'మహర్షి' విడుదలై బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. త్వరరలో తన 26వ మూవీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు.

    English summary
    "The craze for video games is too high these days. We need to impose curbs on children at homes. We need to tell them they can play the games only during specific timings. I have told my children that they can play video games only for one hour between 6 pm and 8 pm (sic)." Mahesh Babu said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X