ఆయన నేషనల్ హీరో, ఈ మూవీ చేయడం గౌరవంగా భావిస్తున్నా: మహేష్ బాబు

Recommended Video

Mahesh Babu About Unnikrishnan Role In Major Movie | FilmiBeat Telugu

'సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్' సంస్థతో కలిసి టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబుకు చెందిన నిర్మాణ సంస్థ 'జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్'... మేజ‌ర్ అనే భారీ చిత్రం రూపొంద‌బోతోంది. 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. క్ష‌ణం, గూఢ‌చారి వంటి సూప‌ర్ డూప‌ర్ చిత్రాల్లో హీరోగా మెప్పించిన అడివిశేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి శ‌శికిర‌ణ్ తిక్క దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఈ మూవీ గురించి స్పందించారు.

అందుకే నిర్మాణ రంగంలోకి..

అందుకే నిర్మాణ రంగంలోకి..

నేను యాక్టివ్‌గా ప్రొడ్యూసర్ కాదు. సమర్థవంతమైన టీమ్ మా ప్రొడక్షన్ హౌస్‌ను రన్ చేస్తోంది. నాకు సినిమా అంటే ఇష్టం. అన్ని రకాల సినిమాలు చేయాలనేది కోరిక. కొన్ని స్టోరీలు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అన్ని సినిమాల్లో నేను నటించలేను కదా... అందుకే ఈ సంస్థను స్థాపించడం జరిగింది అని మహేష్ బాబు తెలిపారు.

నేషనల్ హీరో సినిమా ఇది, గౌరవంగా భావిస్తున్నాను

నేషనల్ హీరో సినిమా ఇది, గౌరవంగా భావిస్తున్నాను

‘మేజర్' అనేది మన నేషనల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తీస్తున్న చిత్రం. ఇలాంటి సినిమాలో భాగం అయినందుకు గౌరవంగా భావిస్తున్నాను. ఈ కథతో అడవి శేష్ చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నారు. అతడు ఆ పాత్రకు పర్ఫెక్టుగా సెట్టవుతాడు. నేను కూడా అతడిని ఆ పాత్రలో చూడాలనుకుంటున్నాను. అందుకే ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావడం జరిగింది.

నా మనసుకు దగ్గరైన చిత్రం ‘మహర్షి’

నా మనసుకు దగ్గరైన చిత్రం ‘మహర్షి’

‘మహర్షి' సినిమా నా హృదయానికి చాలా దగ్గరైన చిత్రం. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. నా కెరీర్లో ఇది ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది. వంశీ పైడిపల్లి సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు.

ఇది ఎవరికైనా సాధ్యమే

ఇది ఎవరికైనా సాధ్యమే

నన్ను అందరూ ఇప్పటికీ 30 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నారని అంటున్నారు. ఇందులో అద్భుతం ఏమీ లేదు. ఆహారం, వ్యాయామం విషయంలో డిసిప్లిన్‌గా ఉంటూ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయడం, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ లివింగ్ ఉంటే ఇది ఎవరికైనా సాధ్యమే

రాజకీయాలు అర్థం కావు

రాజకీయాలు అర్థం కావు

నాకు రాజకీయాలు అర్థం కావు. అందుకే వాటికి వీలైనంత దూరంగా ఉంటాను. మన రాష్ట్రాన్ని, దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపే లీడర్స్ కావాలని కోరుకుంటాను. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. ఈ పని మాత్రమే నేను చేయగలను. ఎప్పటికీ సినిమాల్లోనే కొనసాగుతాను.

 అభిమానుల పట్ల కృతజ్ఞతతో ఉంటా

అభిమానుల పట్ల కృతజ్ఞతతో ఉంటా

నాపై ఇంత అభిమానం, ప్రేమ చూపిస్తున్న అభిమానుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. నా కుటుంబం, అభిమానుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని నమ్ముతాను... అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X