»   » టికెట్స్: ఫ్యాన్స్ దోపిడీకి గురికావొద్దనే మహేష్ బాబు అలా...

టికెట్స్: ఫ్యాన్స్ దోపిడీకి గురికావొద్దనే మహేష్ బాబు అలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాహుబలి' సినిమా విడుదల సమయంలో అభిమానులు నిలుపు దోపిడీకి గురైన సంగతి తెలిసిందే. సినిమా చూడాలనే అభిమానుల బలహీనతను క్యాష్ చేసుకున్నారు చాలా మంది థియేటర్ల వారు. టికెట్లను బ్లాక్ చేసి బ్లాక్‌లో వేల రూపాయలకు అమ్మారు. ఇక హైదరాబాద్ లో బెనిఫిట్ షోల పేరుతో వేల రూపాయలు దండుకున్నారు కొందరు. చారిటీ పేరు చెప్పి ఆ డబ్బంతా అక్రమంగా తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అప్పట్లో ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అయితే ‘శ్రీమంతుడు' విషయంలో మాత్రం అలా జరుగకూడదని మహేష్ బాబు భావిస్తున్నారు. సినిమా విడుదలకు ఒకరోజు ముందు స్పెషల్ షోలు వేయడం, చారిటీ పేరు చెప్పి అభిమానులను నిలువు దోపిడీ చేయడం ఆయనకు ఇష్టం లేదట. ఒక వేళ స్పెషల్ షోలు వేసినా.... మాములూ టికెట్ రేట్లు మాత్రమే వసూలు చేయాలని ఆయన కోరుకుంటున్నారని తెలుస్తోంది.


ఆ సంగతి పక్కన పెడితే... మరో వారంలో సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. ఈ బిజీ కారణంగా ఆయన తమిళ వెర్షన్ కు డబ్బింగ్ కూడా చెప్పలేక పోయారు. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా తాజా ఇంటర్వ్యూలో చెప్పారు.


Mahesh Babu against Srimanthudu Special Shows

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ‘U' వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.


జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.


ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీస్ సినిమా ద్వారా వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటాయి. ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.

English summary
Mahesh Babu starrer ‘Srimanthudu’ is releasing on Aug 7th. Fans have decided to exhibit special shows as usual. But Mahesh is believed to have advised them against it.
Please Wait while comments are loading...