»   »  మహేష్ బాబు మంచు మనోజ్ పెళ్లి (వీడియో)

మహేష్ బాబు మంచు మనోజ్ పెళ్లి (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సినీనటుడు మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్‌ వివాహం ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి మహేష్ బాబు సతీసమేతంగా హాజరయ్యారు. ఘట్టమనేని దంపతులను...మోహన్ బాబు ...సగౌరవంగా ఆహ్వానించారు. మహేష్ బాబు అక్కడ ఉన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నారు. మీరే చూడండి..

ఇక ఈ వివాహానికి ....

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, రామోజీరావు, జీఎంఆర్‌ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఎంపీ సుబ్బరామిరెడ్డి, వైకాపానేత జగన్‌, సినీ దర్శకులు దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, సినీ నటులు బాలకృష్ణ, రజనీకాంత్‌, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌బాబు, సూర్య, ప్రభాస్‌ తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

Mahesh Babu at Manchu Manoj's Wedding!

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బంధుమిత్రులు, సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో మనోజ్-ప్రణతి రెడ్డి హిందూ సాంప్రదాయ బద్దంగా ఒక్కటయ్యారు. ముఖ్యంగా కీలకమైన మూడు ముళ్ల మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత జరిగిన తలంబ్రాల ఘట్టంలో వధూ వరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

English summary
Mahesh Babu and Namrata attended Manchu Manoj's wedding Today and blessed the newly wed couple.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu