For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సరిలేరులో అదే హైలెట్.. ఆ విషయంలో క్లారిటీ వస్తుందా.. టెన్షన్‌లో సూపర్ స్టార్ ఫ్యాన్స్

  |

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దూకుడు మీదున్నాడు. భరత్ అనే నేను, మహర్షి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో బాక్సాఫీస్ పని పట్టిన మహేష్.. మరోసారి దాడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. పోకిరి చిత్రం నుంచి తన యాస, భాష, యాటిట్యూడ్ అన్ని మార్చుకుని డిఫరెంట్ రోల్స్ చేస్తూ.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్‌లు కొట్టాడు. ఖలేజా, దూకుడు లాంటి చిత్రాల్లో తనదైన నటనతో మహేష్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

  ఎఫ్2తో సత్తా చాటిన డైరెక్టర్..

  ఎఫ్2తో సత్తా చాటిన డైరెక్టర్..

  ఈ ఏడాది సంక్రాంతిబరిలోకి దిగిన పెద్ద చిత్రాలను వెనక్కునెట్టి మరీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది ఎఫ్2. వినయ విదేయ రామ, కథానాయకుడు లాంటి చిత్రాలు బోల్తా కొట్టగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్2 రికార్డుల్లో కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.

   పవర్‌ఫుల్ పాత్రలో మహేష్..

  పవర్‌ఫుల్ పాత్రలో మహేష్..

  సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండోబోతోందని టాక్. ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ చేసే పోరాటాలు, ట్రయిన్ ఎపిసోడ్, కర్నూలు కొండారెడ్డి బుర్జు సెంటర్ ద‌ృశ్యాలు అబ్బుర పరుస్తాయని తెలుస్తోంది.

  ప్రత్యేక పాత్రల్లో విజయశాంతి, బండ్ల గణేష్..

  ప్రత్యేక పాత్రల్లో విజయశాంతి, బండ్ల గణేష్..

  ఈ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా విజయశాంతి, బండ్ల గణేష్ నిలవబోతోన్నట్టు సమాచారం. వీరిద్దరి కోసం అదిరిపోయే క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికి భారతి పాత్రలో విజయశాంతి లుక్‌ను రిలీజ్ చేయగా.. అది ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ నుంచి టీజర్ కూడా రాబోతోంది.

  టీజర్‌కు రంగం సిద్దం..

  టీజర్‌కు రంగం సిద్దం..

  మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ కి కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటలలో మహేష్ టీజర్‌తో సత్తా చాటనున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మహేష్‌ని ఎలా చూపించబోతున్నారు అని ఆసక్తిగా మరియు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

  అదే హైలెట్..

  అదే హైలెట్..

  సంక్రాంతి బరిలో దిగుతున్న మహేష్ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలున్నాయి. సరిలేరు నీకెవ్వరు మూవీలో మహేష్ ఆటిట్యూడ్ అండ్ డైలాగ్ డెలివరీ హైలెట్‌గా ఉంటుందట. దీనికోసం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడని సమాచారం.

  #Cinebox : #KRKRTrailer2 Released | Chiranjeevi - Manisharma To Team Up Again
   వెనక్కుతగ్గుతాడా..

  వెనక్కుతగ్గుతాడా..

  అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో', మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు' ఒకేరోజున విడుదల కానుండటంతో బయ్యర్స్ టెన్షన్ పడుతూ నిర్మాతలకు ఫోన్ చేసారని తెలుస్తుంది. ఈ విషయమై ‘సరిలేరు నీకెవ్వరు' నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు.. ‘అల వైకుంఠపురములో' టీంతో మీటింగ్ పెట్టి ఓ అండర్స్టాండింగ్ కు వచ్చినట్టు కూడా ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది. కాబట్టి నేటి ఆ టీజర్ ద్వారా విడుదల తేదీలో ఏదైనా మార్పు ఉందా లేదా అన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేస్తుంది.

  English summary
  Mahesh Babu Sarileru Neekevvaru Teaser Coming Soon. Teaser Date Will Be Unlocked Today Evening. This Movie Is Going To Relaese On 12th January. this Movie Is Directed By Anil Ravipudi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X