»   » బాలకృష్ణ, మహేష్ బాబుల దసరా ట్రీట్..!

బాలకృష్ణ, మహేష్ బాబుల దసరా ట్రీట్..!

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మళ్ళీ జూ ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల మధ్య పోటీ ఏర్పడుతుందని అంతా అనుకుంటే, చివరకు మహేష్ తో బాలకృష్ణ సై అనే పరిస్థితి కనిపిస్తోంది. దూకుడు, శ్రీరామ రాజ్యం వారం వ్యవధిలో విడుదల కానున్నాయని వార్తలొస్తున్నాయి. సెప్టెంబర్ 9న దూకుడు, 16న శ్రీరామ రాజ్యం విడుదలవుతాయని అంటున్నారు. ఒకవేళ ఈ చిత్రాల విడుదలలో వారం రోజుల జాప్యం జరిగినా కానీ వారం వ్యవధిలో పోటీ పడడం మాత్రం అనివార్యమని చెప్పుకుంటున్నారు.

  అదే జరిగితే మరోసారి మహేష్ బాబుకి, నందమూరి హీరోకి పోటీ తప్పదనిపిస్తోంది. ఇంతకుముందు జరిగిన పోరులో జూ ఎన్టీఆర్ బృందావనం హిట్టనిపించుకోగా, మహేష్ ఖలేజా మట్టి కరిచింది. ఈసారి త్రాసు ఎవరివైపు మొగ్గుతుందనేది వేచి చూడాలి. ఈ రెండు చిత్రాల జోనర్స్, టార్గెట్ ఆడియన్స్ వేరు కనుక సినిమాల మధ్య పోటీ ఉండకపోవచ్చు కానీ ఫాన్ వర్స్ మాత్రం ఆగే అవకాశం లేదు. ఫైనల్ గా బాక్సాఫీస్ ని గెలిచేది ఎవరనేది వేచి చూద్దాం..

  వీరిద్దరి సినిమాలే కాకుండా దసరాకు జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి విడుదల చేయాలని శరవేగంగా రూపుదిద్దుకొంటోంది. అలాగే ప్రొడక్షన్ వర్క్ లో ఉన్ననాగార్జున నటించిన రాజన్న, వెంకటేష్ నటిస్తోన్న బాడీగార్డ్, పవన్ కళ్యాణ్ 'కాళీ" మొదలగు సినిమాలన్నీ దసరా రేసులో ఉండటం విశేషం. సో ఇండస్ట్రీలో ఆయా హీరోల ఫ్యాన్స్ కి మిని ఫిల్మ్స్ ఫెస్టివల్ గా బరిలోకి దిగనున్నాయి.

  English summary
  Mahesh Babu’s Dokkudu will be the first film to hit the screens and it will be released in the last week of September just before the 9 day navaratri festival. Jr. NTR’s Oosaravali and Balakrishna’s Sri Ramarajyam will be released in October just around Dassera. Nagarjuna’s Rajanna, Venkatesh’s Bodyguard and Pawan Kalyan’s films too are slated for release during Dassera.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more