»   »  మహేష్ ఇక సామాజిక సేవ

మహేష్ ఇక సామాజిక సేవ

Posted By:
Subscribe to Filmibeat Telugu
అతిథి దేవో భవ అంటూ థమ్సప్ అంబాసిడర్ గా అభిమానుల ఇళ్లలోకి వెళుతున్న మహేష్ బాబు ఇపుడు అతిథి సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అతిథి సినిమా తరువాత దొరికిన ఈ సమయాన్ని థమ్సప్ అంబాసిడర్ గానే కాకుండా మహేష్ బాబు ఏదైనా సామాజిక సేవ కూడా చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తనకున్న పాపులారిటీతో ప్రజలకు తోచిన సాయం చేయాలనే యోచనలో మహేష్ ఉన్నట్టు తెలుస్తోంది. మూడు నెలలు షూటింగ్ లకు దూరంగా ఉందామనుకుంటున్న మహేష్ ఆ తరువాత మిర్చి, హరే రామ హరే కృష్ణ సినిమాలలో ముందుగా మిర్చి సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఇలా ఉన్నట్టుండి చారిటీ పనులు చేయాలని మహేష్ అనుకోవడం వెనుక భార్య నమ్రత ఉన్నట్టు తెలుస్తోంది.

Read more about: mahesh babu namrata
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X