»   » నా దగ్గర ఆ లక్షణాలు లేవు, వాళ్ళకి హ్యాట్సాఫ్: ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్, నాగార్జునల పైనే(నా)

నా దగ్గర ఆ లక్షణాలు లేవు, వాళ్ళకి హ్యాట్సాఫ్: ఈ వ్యాఖ్యలు ఎన్టీఆర్, నాగార్జునల పైనే(నా)

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్పైడర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ మహేశ్ బాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫ్ కోర్స్ రెండ్రోజులుగా అలాంటి "ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడనుకోండి. ఇప్పుడు ఇంకోటి కూడా యాడ్ చేసాడు. అదే టీవీ షోలకి హోస్ట్ గా వ్యవహరించటం మీద తన అభిప్రాయం చెప్పేసాడు. మహేశ్ బాబును బుల్లితెరపై చూసే అవకాశముందా అనే ప్రశ్నకు మహేశ్ తనదైన రీతిలో సమాధానమిచ్చాడు. టీవీ షో అంటే ఒక కప్పు టీ తాగడం లాంటిది కాదని, టీవీ షోలను చేయాలంటే దానికి కొన్ని లక్షణాలుండాలని. అవి తన దగ్గర లేవని మహేశ్ తెలిపాడు.

జూనియర్ ఎన్టీఆర్, నాగార్జన వంటి స్టార్స్ టీవీ షోలను చేయడం పైనా మహేశ్ స్పందించాడు. వారికి ఆ అర్హత ఉందని, టీవీ షోలు చేయడం కోసం వారు పెడుతున్న శ్రమకు హ్యాట్సాఫ్ అని వ్యాఖ్యానించాడు. ఈ కామెంట్స్‌తో మహేశ్‌ టీవీ షోలు చేసే అవకాశమే లేదని స్పష్టమైంది. అంతేకాదు, నో టీవీ.. నో పాలిటిక్స్ అనే సూత్రానికి మహేశ్ కట్టుబడి ఉన్నాడని అర్థమవుతోంది.

Mahesh Babu coments on Reality show hosting

మహేశ్ చేసిన కామెంట్స్‌పై ఇతర హీరోల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర హీరోల గురించి ఇంత పాజిటివ్‌గా మాట్లాడటంతో మహేశ్‌పై తమ గౌరవం మరింత పెరిగిందని వారు చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా మహేశ్ కామెంట్స్‌పై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. హీరోలమధ్య ఉండే ఇలాంటి ఫ్రెండ్లీ వాతావరణం బయట అభిమానుల్లో కూడా ద్వేషాలను తగ్గిస్తుందని చాలామంది కోరుకుంటున్నదే కదా. ఇప్పుడు ఇలా మహేష్ అదే రూట్లో ఉండటం కాస్త ఆనందించేదే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది టాలీవుడ్ లో ఏహీరో ఇప్పటివరకూ చేయనన్ని ఎండార్స్మెంట్లకి, అడ్వర్టైజ్మెంట్లకీ సంతకం చేసిందీ, చేస్తున్నదీ మహేషే. అంటే ఇక్కడ చేసే పనికంటే తక్కువ చేసినా తన ఇమేజ్ నీ, సంపాదననీ ఆ స్థాయిలోనే ఉంచుతున్నాడు ఈ సూపర్స్ టార్. ఒక్కో బ్రాండ్ కీ మహేష్ చేసే చార్జ్ కోట్లలోనే ఉంటుంది. ఈ లోకల్ టాక్ షోలకీ, రియాలిటీ షోలకీ హోస్ట్ గా చేసి తాను లోకల్ అనే ఫీలింగ్ కి దూరంగానే ఉండాలనుకుంటున్నాడేమో...

English summary
Tollywood Superstar Mahesh Babu coments on Reality show hosting in telugu chanels
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu