»   » నాగార్జున చేసాడు... ఇప్పుడు మహేష్ కూడా, తమిళ మార్కెట్ కోసమేనా ఇదంతా..!?

నాగార్జున చేసాడు... ఇప్పుడు మహేష్ కూడా, తమిళ మార్కెట్ కోసమేనా ఇదంతా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య ప్రతినాయక పాత్రలో అలరించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన మరో వార్త సూపర్ స్టార్ అభిమానులకు కిక్ ఇస్తోంది.

ఇటీవల మహేష్ హీరోగా తెరకెక్కిన శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు తమిళ నాట కూడా భారీగా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాల తమిళ వర్షన్ లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ తో మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పించారు. కానీ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మాత్రం తమిళ వర్షన్ కు కూడా మహేష్ స్వయంగా డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడట.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తమిళ వెర్షన్ కి ఓన్ గా డబ్బింగ్ చెప్పనున్నాడు. మహేష్ బాబు బాల్యం, కాలేజ్ డేస్ అన్నీ చెన్నైలోనే గడిచాయి, తమిళంలో చాలా బాగా మాట్లాడగలడు మహేష్ బాబు. అందుకే ఈ సినిమాకి తన ఓన్ డబ్బింగ్ చెప్పడానికి సిద్దమయ్యాడని అంటున్నారు. ఈ సినిమాలో పని చేసిన కొందరు నటులు కూడా మహేష్ బాబు తమిళ్ మాట్లాడటం చూసి షాక్ అయ్యారట.

 Mahesh Babu to dub in Tamil for Murugadoss's film

మొన్నటికి మొన్న నాగార్జున కూడా ఊపిరి తమిళ్ వెర్షన్ కి తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. తమిళ వెర్షన్ కూడా మంచి విజయాన్నే చూసింది. అక్కడ నగ్ కి మరింత ఫాలోయింగ్ పెరిగింది. ఇదేదో బావుందనుకున్న ప్రిన్స్ కూడా... అదే బాట ట్రయ్ చేస్తున్నట్టున్నాడు. నిజానికి శ్రీ మంతుడు తమిళ్ వెర్షన్ కే మహేష్ డబ్బింగ్ చెప్పుకున్నాడు అంటూ వార్తలు వచ్చయి కానీ.. తర్వాత అది నిజం కాదనీ.., మిగిలిన ప్రాజెక్టులలో బిజీగా ఉండటం వల్ల తాను డబ్బింగ్ చెప్ప లేక పోయాననీ మహేష్ బాబే స్వయంగా చెప్పాడు.

బాహుబలి ఒక్క తెలుగు లోనే కాకుండా, తమిళ, మలయాళ , హిందీ భాషల్లో దుమ్ము దులపడంతో మిగతా వాళ్ళు కూడా అదే స్టైల్ లో తమ సినిమాలకి మార్కెట్ పెంచుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. మిగతా భాషల సంగతి పక్కన పెడితే ముఖ్యంగా తమిళ్ మార్కెట్ పైన మొదటగా కన్నేశారు. మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు, గుణశేఖర్ రుద్రమదేవి, రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలు అదే దారిలో తమిళ్ లో రిలీజ్ అయ్యాయి. సంగతి పక్కన పెడితే,ఇప్పటి వరకూ లేని ఒక కొత్త ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది.

English summary
Superstar Mahesh Babu is currently busy shooting for A R Murugadoss's Tamil Telugu bilingual. According to reliable sources, Mahesh Babu will dub in hisn own voice in both the languages
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu