»   » మహేష్ ‘1’ ఫెయిలైతే.. సినిమాలు చూడ్డం వేస్ట్ (ఫోటోలు)

మహేష్ ‘1’ ఫెయిలైతే.. సినిమాలు చూడ్డం వేస్ట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. టెక్నికల్‌గా సినిమా హాలీవుడ్ సినిమాల స్ధాయిలో హై స్టాండర్డ్స్‌లో ఉండాలని సుకుమార్ ఫిక్సై తీసాడని మొదటి ఫ్రేమ్ నుంచే అర్దమవుతుంది. అయితే ఈచిత్రం తెలుగు ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా లేదనేది మరికొందరి వాదన.

  అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం చాలా బాగుందని అంటున్నారు. ఇది ప్యూర్ టెక్నికల్ ఫిల్మ్, మూస తెలుగు సినిమాల్లా కాకుండా డిపరెంట్ జానర్లో దర్శకుడు తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని రేంజిలో ఉందని అంటున్నారు. మన సినిమాలు హాలీవుడ్ సినిమాల్లా లేవని చాలా మంది అంటారు....అలా తీస్తే తెలుగు సినిమా ప్రేక్షకుల టేస్టుకు తగిన విధంగా లేదని వంక పెడతారని....'1' సినిమాను విమర్శిస్తున్న వారిపై మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు.

  మరికొందరు అభిమానులు మరొక అడుగు ముందుకేసి సరికొత్త వాదన వినిపిస్తున్నారు. తెలుగు సినిమా చూసే వారి స్టాండర్డ్స్‌కి ఈ సినిమా ఒక టెస్ట్. దీనిలో ఫెయిల్ అయితే మీరు సినిమాలు చూడటం వేస్ట్ అంటూ అభిప్రాయ పడుతున్నారు. అంటే మహేష్ బాబు '1' సినిమాను అర్థం చేసుకోలేని వారు సినిమాలు చూడటం దండగ అని చెప్పకనే చెబుతున్నారు.

  మరి అభిమానులు ఏమంటున్నారు? అనే విషయాలు స్లైడ్ షోలో....

  AngryDiamond ‏@TeluguDiamond

  AngryDiamond ‏@TeluguDiamond


  తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇదొక టిపికల్ ఫిల్మ్. ఈ జానర్ ఫిల్మ్స్ చాలా మంది ప్రేక్షకులకు నచ్చకు పోవచ్చు. కానీ ఇది పర్ ఫెక్ట్ ఫిల్మ్.

  PAVAN RACHAPUDI ‏@rachaSaipavan

  PAVAN RACHAPUDI ‏@rachaSaipavan


  తెలుగు సినిమా చూసే వారి స్టాండర్డ్స్‌కి ఈ సినిమా ఒక టెస్ట్. దీనిలో ఫెయిల్ అయితే మీరు సినిమాలు చూడటం వేస్ట్

  Varun Yeggina ‏@Yeggina

  Varun Yeggina ‏@Yeggina


  ఈ సినిమా పూర్తి మహేష్ బాబు షో. కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో డిసెంట్ థ్రిల్లర్ సినిమాను సుకుమార్ తెరకెక్కించారు. తప్పకుండా చూడాల్సిన సినిమా.

  AjayAvirineni ‏@ajay_nani

  AjayAvirineni ‏@ajay_nani


  ఈ సినిమా ‘ఎ' క్లాస్ సెంటర్లలో రికమండ్ చేయాల్సిన సినిమా. ఇంటర్వెల్ సీన్ అయితే అరాచకంగా ఉంటుంది.

  Raja Satish ‏@Rajaism

  Raja Satish ‏@Rajaism


  1 నేనొక్కడినే అనేది ఒక ప్రయోగాత్మక చిత్రం. కమర్షియల్ అంశాలు ఎక్కువగా లేవు.

  Srinivas Pendela ‏@spendela

  Srinivas Pendela ‏@spendela


  1 నేనొక్కడినే ఫస్ట్ హాఫ్‌లో అమృతాంజన్, సెకండాఫ్‌లో జండూ బామ్ అవసరం. టైటిల్ పెట్టుకోవడం కాదు డ్యూడ్...మూవీలో కంటెంట్ కూడా ఉండాలి.

  Aravind ‏@aravindcherry

  Aravind ‏@aravindcherry


  ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. అయితే నేరేషన్ స్లోగా ఉంది. కన్‌ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే.

  Shreya Annam ‏@shreyaannam

  Shreya Annam ‏@shreyaannam


  ఫస్టాఫ్ చాలా బాగుంది. క్రేజీ ఇంటర్వెల్ సీన్. మహేష్ అంటే...

  ChandraSekhar ‏@chandrasekhartv

  ChandraSekhar ‏@chandrasekhartv


  రిస్క్ చేయాలనుకుంటే ధైర్యం చేసి ‘1 నేనొక్కడినే' సినిమాకు వెళ్లండి. టేకింగ్, నేరేషన్, టైమింగ్ లేకుండా సాంగులు, దాదాపుగా సినిమా అన్ని విషయాల్లో విఫలం.

  Dinesh K Reddy ‏@Dinesh4you_SACH

  Dinesh K Reddy ‏@Dinesh4you_SACH


  ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమలో బెస్ట్ సినిమాటోగ్రఫీ ఫిల్మ్ ‘1 నేనొక్కడినే'. రత్నవేలుకు ప్రొఫెసర్ సుకుమార్ క్లాస్‌లో మహేష్ ఫ్యాన్స్ ఇపుడు సీనియర్స్. గ్యాడ్యుయేట్స్ అయిపోయారు. నెక్ట్స్ బ్యాచ్ జూనియర్ ఫ్యాన్స్ సెలబస్ కనుక్కోండి ముందే.

  Ramjee ‏@RamjeeUrstruly

  Ramjee ‏@RamjeeUrstruly


  ‘1 నేనొక్కడినే' స్టంట్స్ సూపర్బ్. ఓవరాల్ టెక్నికల్ సినిమా. చాలా బాగుంది. సెకండాఫ్ ఆల్ సెంటర్స్ దుమ్ము రేపుతుంది. ఫస్ట్ ఆఫ్ ‘ఎ' సెంటర్లలో 100 డేస్ ఆడుద్ది.

  Sai Kumar THOTA ‏@saikumarthota

  Sai Kumar THOTA ‏@saikumarthota


  1 నేనొక్కడినే చిత్రానికి ఎలాంటి అంచనాలు లేకుండా రండి- సుకుమార్. ‘ఎవడు' చిత్రానికి మీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకుని రండి- చిరు...ఇదీ గట్స్ అంటే.

  Tom Bhayya ‏@TomBhayya

  Tom Bhayya ‏@TomBhayya


  ‘1 నేనొక్కడినే' చిత్రం ఫస్ట్ ఆఫ్ సైకలాజికల్ యాక్షన్ థ్రిలర్ ఇన్ టాలీవుడ్. మహేష్ బాబు ఎక్సలెంట్ యాక్టింగ్. నా రేంటింగ్ 4/5.

  Ashok Raju ‏@ASHOKTHEKING

  Ashok Raju ‏@ASHOKTHEKING


  ‘1 నేనొక్కడినే' చిత్రంలో హీరో పేరెంట్స్ కోసం సెర్చ్ చేస్తుంటాడు. ‘ఎవడు' చిత్రంలో విలన్ హీరో కోసం సెర్చ్ చేస్తుంటారు. ఒక సెర్చ్ ఎటో పోయింది...ఇంకో సెర్చ్ ఎటు వెలుతుందో?

  KV Sarika ‏@SarikaKV

  KV Sarika ‏@SarikaKV


  సినిమా చాలా బాగుంది. ఎలాంటి అనవసర సీన్లు లేకుండా నీట్‌గా ఉంది.

  Preethi Pinisetty ‏@like_preethi

  Preethi Pinisetty ‏@like_preethi


  1 నేనొక్కడినే ఒక డిఫరెంట్ అప్రోచ్ టు తెలుగు సినిమా. రెగ్యులర్ కమర్షియల్ మూవీల సంస్కృతిని బ్రేక్ చేయండి.

  AngryDiamond ‏@TeluguDiamond

  AngryDiamond ‏@TeluguDiamond


  మహేష్ బాబు తప్ప ఈ సినిమాను ఎవరూ చేయలేరు. మన వాళ్లకంటే బయటి వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ రేంజిలో ఉంది సినిమా.

  English summary
  Mahesh Babu's most anticipated movie 1: Nenokkadine, which has hit the screens today, has embarked on a fantastic start at the Box Office in Andhra Pradesh as well as across the globe. Continue to slide to read the response of the viewers, who have watched it this morning.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more