»   » మహేష్ బాబు ఫిట్ నెస్ సీక్రెట్, తిండి వివరాలు

మహేష్ బాబు ఫిట్ నెస్ సీక్రెట్, తిండి వివరాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న '1' సినిమా కోసం మహేష్ బాబు ఇంటర్నేషనల్ ఫిట్ నెస్ ట్రైనర్ క్రిస్ గెతిన్ ఆధ్వర్యంలో తన బాడీ రూపులు మార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైనింగ్ తర్వాత 37 సంవత్సరాల వయసుగల మహేష్ బాబు పాతికేళ్ల కుర్రాడిలా మారిపోయాడు.

ట్రైనింగ్ సయమంలో మహేష్ బాబు ఏం తినేవాడో తెలుసా?...క్రిస్ గెతిన్ చెప్పిన వివరాల ప్రకారం రోజుకు 7 సార్లు పౌష్టికారం తీసుకునే వాడట మహేష్ బాబు. అందులో చికెన్, ఫిష్, బచ్చలి కూర, ఓట్స్, పాస్తా, బ్రాకోలి లాంటి అధిక పోషక విలువలున్న పదార్థాలు ఉండేవట.

సినిమా వివరాల్లోకి వెళితే...

'1' చిత్రాన్ని 14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. కృతి సనమ్ హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ నార్తన్ ఐర్లాండ్, లండన్, యు.కె.లో జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కీలకమైన భాగం ఇక్కడే చిత్రీకరిస్తున్నారు.

సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ప్లాన్లో ఉన్నారు నిర్మాతలు. ఆశించినన్ని థియేటర్లు దొరికితే సెప్టెంబర్ మొదటి వారంలో కూడా విడుదల చేయడానికి ముందస్తు ప్రణాళికలు తయారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు గతంలో ఏ చిత్రంలోనూ కనిపించని విధంగా స్టైలిష్ లుక్ తో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్లో మహేష్ బాబుకు సరికొత్త లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు.

ఈ చిత్రానికి హాలీవుడ్ స్టంట్ కోఆర్డినేటర్ కాన్రాడ్ పాల్మిసన్ పని చేస్తున్నారు. కొన్ని ప్రత్యేకమైన యాక్షన్ సీన్లను ఈయన కంపోజ్ చేయబోతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మహేష్ బాబు తనయుడు గౌతం కృష్ణ ఈచిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించడం ద్వారా వెండితెర ఆరంగ్రేటం చేయబోతున్నాడు.

ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.

English summary
Super Star Mahesh Babu is grooming his body for his upcoming movie under the direction of Sukumar. Mahesh had hired a new trainer, Kris Gethin who trained Hrithik Roshan for Krish-3. Sources say Prince is paying a whopping Rs 50 lakhs for his new looks.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu