»   » ఆటపట్టించిన మహేష్ బాబు.... నవ్వులే నవ్వులు, చిటికేసి మంజుల చాలెంజ్!

ఆటపట్టించిన మహేష్ బాబు.... నవ్వులే నవ్వులు, చిటికేసి మంజుల చాలెంజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో 'మనసుకు నచ్చింది' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా పిబ్రవరి 16న విడుదలవుతున్న నేపథ్యంలో మహేష్ బాబు చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ చాలా ఫన్నీగా సాగింది.

మంజుల ఇలా చేస్తుందనుకోలేదు

మంజుల ఇలా చేస్తుందనుకోలేదు

మంజుల డైరెక్షన్ చేస్తుందని ఎప్పుడూ అస్సలు అనుకోలేదు. ఈ విషయం తెలిసి సర్ ప్రైజ్ అయ్యాను అదే సమయంలో హ్యాపీ ఫీలయ్యాను. ‘మనసుకు నచ్చింది' ట్రైలర్ చూసిన తర్వాత సినిమాపై ఆసక్తిమరింత పెరిగింది అని మహేష్ బాబు తెలిపారు.

అపుడు లోలోపల నవ్వుకున్నాను

అపుడు లోలోపల నవ్వుకున్నాను

రెండు సంవత్సరాల క్రితం మేమంతా కలిసి మాల్దీవులకు వెకేషన్ వెళ్లాం. ఆ సమయంలో పక్కన కూర్చుని ఏదో రాసుకుంటుంది. ఏంటి రాస్తున్నావు అని అడిగితే స్టోరీ అని చెప్పింది. సరే కథలు రాసుకుంటుంది అనుకున్నాను. తర్వాత మా ఫ్రెండును ఫోన్లో స్టోరీలు రాసుకునే యాప్ గురించి ఎంక్వయిరీ చేసింది. అప్పటి వరకు నాకు తెలియదు మంజుల ఎందుకు ఇలా చేస్తుందో. అపుడు చెప్పింది నేను సినిమా డైరెక్షన్ చేయబోతున్నాను అని... లోపల లోపల నవ్వుకున్నాను.... అని మహేష్ బాబు తెలిపారు.

నా వరకు దర్శకత్వం చాలా కష్టం, మంజు పని తీరు గర్వంగా ఉంది

నా వరకు దర్శకత్వం చాలా కష్టం, మంజు పని తీరు గర్వంగా ఉంది

నా వరకు అయితే దర్శకత్వం అనేది చాలా డిఫకల్ట్ జర్నీ. కానీ మంజుల ఈజీగా చేసేసింది. సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ చూశాను. గర్వంగా పీలవుతున్నాను.... అని మహేష్ బాబు తెలిపారు.

ఆటపట్టించి నవ్వించిన మహేష్ బాబు

ఆటపట్టించి నవ్వించిన మహేష్ బాబు

మంజుల డైరెక్షన్ చేస్తున్న వీడియో చూసిన తర్వాత మహేష్ బాబు స్పందిస్తూ.... స్టార్ కెమెరా, యాక్షన్ అని మంజుల హై వాయిస్‌తో చెప్పడం ఫన్నీ కామెంట్ చేసి సోదరిని ఆటపట్టించి అందరినీ నవ్వించాడు మహేష్ బాబు.

 దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదనప్న మహేష్ బాబు

దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదనప్న మహేష్ బాబు

నేను బాల నటుడిగా చాలా సినిమాలు చేశాను. 18 సంవత్సరాల నుండి నటిస్తున్నాను. అప్పటి నుండి నా మనసులో దర్శకత్వం అనేది ఎంటైర్లీ డిఫికల్ట్ అనే భావన ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే అది డిఫికల్ట్ కావొచ్చు. ఎందుకంటే నేను యాక్టర్. ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలనే ఉహకూడా నాకు రాలేదు. నటుడిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. డే బై డే నటుడిగా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనే దానిపైనే నా ఆలోచన ఉంటుంది అని మహేష్ బాబు తెలిపారు.

ఆ సౌండ్ ఫన్నీగా అనిపించింది

ఆ సౌండ్ ఫన్నీగా అనిపించింది

నేను ఎప్పుడూ డైరెక్షన్ గురించి ఆలోచించలేదు కాబట్టి మంజు సడెన్ గా డైరెక్షన్ అనగానే నాకు కొత్తగా అనిపించింది. ఆమె ఇప్పటి వరకు సినిమాలు నిర్మించింది, నటించింది... తర్వాత డైరెక్షన్ అనగానే ఆ సౌండ్ లిటిల్ ఫన్నీగా అనిపించింది. ఇపుడు ఇదంతా చూసిన తర్వాత మంజులను చూస్తుంటే గర్వంగా ఉంది... అని మహేష్ బాబు తెలిపారు.

 జోక్ చేస్తుంది అనుకున్నాను

జోక్ చేస్తుంది అనుకున్నాను

ఈ సినిమాకు కథ కూడా మంజులగారే రాశారు. చిన్నపుడు మీకు కథలు చెప్పేవారా? అని యాంకర్ ప్రశ్నించగా.... మహేష్ బాబు స్పందిస్తూ అసలు సంబంధం లేదండీ, హాలిడేకు వెళితే కథ రాస్తోంది, ఏమిటి అంటే నేను జోక్ చేస్తుంది అనుకున్నాను. కానీ రెండేళ్ల తర్వాత అది నిజమైంది. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ చిత్రానికి పని చేసిన డిఓపి రవి యాదవ్‌తో కూడా నేను గతంలో కూడా పని చేశాను. విజువల్స్ చాలా బావున్నాయి.... అని మహేష్ బాబు తెలిపారు.

 డబ్బింగ్ సమయంలో నస పెట్టింది

డబ్బింగ్ సమయంలో నస పెట్టింది

ఈ సినిమా కోసం నా దగ్గరికి వచ్చి వాయిస్ ఓవర్ చెప్పమంది. డైలాగ్ రైటర్ ఎవరు? అని అడిగానే... నేనే...నేనే ఈ డైలాగులు కూడా రాస్తాను అని చెప్పింది. (మహేష్, మంజుల నవ్వులు). డబ్బింగ్ థియేటర్ వెళ్లిన తర్వాత వాయిస్ ఓవర్ అంటే రెండు మూడు లైన్లు అనుకున్నాను. కానీ వన్ మినట్ కంటే ఎక్కువగా ఉంది. అది పర్ఫెక్టుగా చెప్పడానికి నాకు రెండు గంటల సమయం తీసుకుంది. దానికి కూడా అలా చెబితే బెటరా? ఇలా చెబితే బెటరా అంటూ నస పెట్టింది. నేను వెంటనే.... ష్.. నువ్వు వెళ్లు నేను నీకు ఐదారు వేరియేషన్స్ చెబుతాను, నీకు నచ్చింది తీసుకో అని నా పని ముగించి వెళ్లిపోయాను... అని మహేష్ బాబు చెప్పారు.

 సినిమాటోగ్రఫీ గురించి

సినిమాటోగ్రఫీ గురించి

సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడాలని యాంకర్ కోరగా.... మంజుల స్పందిస్తూ ‘రవి యాదవ్ గారు షో టైమ్ నుండి నాకు పరిచయం. అతడి పనితీరు నాకు చాలా ఇష్టం. ఆ గ్రీన్ కలర్ అనేది చాలా బాగా తీసుకొచ్చాడు అని చెప్పారు. వెంటనే మహేష్ బాబు అందుకుని... ‘ఆ గ్రీన్ కలర్ బాగా తీసుకొచ్చారు. ఆ టోన్ కరెక్టుగా ఉంది అనే పదాలు మంజుల నుండి వింటుంటే చాలా కొత్తగా అనిపించింది. (మళ్లీ మహేష్ బాబు, మంజుల నవ్వులు) అని చెప్పుకొచ్చారు.

మహేష్ బాబుకు మంజుల చాలెంజ్

మహేష్ బాబుకు మంజుల చాలెంజ్

ఫస్ట్ టీజర్ వాట్సాప్‌లో మహేష్‌కు పంపించి ఆ బ్లూ టిక్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూశాను మంజుల తెలిపారు. మహేష్ బాబు వెంటనే అందుకుని... మనం రీడ్ చేసినా కానీ తెలియకుండా ఉండే ఓ ఆప్షన్ వాట్సాఫ్ లో ఉందట. అదేంటో నేను కనిపెట్టాలి ఇపుడు నేను అంటూ నవ్వులు పూయించారు. మళ్లీ మంజుల రియాక్ట్ అవుతూ.... నేను నీకు నా కంటెంట్ వాట్సాప్ పంపిస్తూనే ఉంటాను, నువ్వు చూస్తూనే ఉండాలి. నువ్వు ఏదో ఒకరోజు ఏయ్ మంజు మన సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అడుగుతావ్.... అంటూ చిటికేసి మరీ చాలెంజ్ చేశారు మంజుల.

 చివరగా మహేష్ బాబు

చివరగా మహేష్ బాబు

ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. మా ఇంట్లో సినిమా హిట్ టాక్ వస్తే అంతా కలుస్తాం. డిన్నర్ చేస్తాం. మంజులతో కలిసి మరోసారి అలాంటి సెలబ్రేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అని మహేష్ బాబు ఆకాక్షించారు.

English summary
Mahesh Babu Funny interview Manasuki Nachindi Team. Manasuku Nachindi directed by debutant Manjula Ghattamaneni and is being jointly produced by Sanjay Swaroop and P.Kiran under his banner Anandi Art Creations. It will feature Sundeep Kishan, Amyra Dastur, Tridha Choudhury and Adith Arun in the lead roles. Radhan is the Music Director .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu