»   » మహేష్ బాబు- గౌతమ్ మీనన్ కాంబినేషన్ ఓకే అయింది!

మహేష్ బాబు- గౌతమ్ మీనన్ కాంబినేషన్ ఓకే అయింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గౌతమ్ మీనన్ కాంబినేషన్లో సినిమా రాబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించోతున్నారు. ఈ విషయాన్ని అశ్వినీదత్ స్వయంగా ప్రకటించారు.

అశ్వనీదత్ మాట్లాడుతూ 'మహేష్ బాబు, గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ లో నెక్స్ట్ మూవీ ఉంటుంది. ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా లాంచ్ చేయనున్నారు. అలాగే సినిమాని 2017 సమ్మర్ కానుకగా మే లో రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.

Mahesh Babu-Gautham Menon’s film soon

ఐదేళ్ల క్రితం ఎన్టీఆర్ తో 'శక్తి'సినిమా తీసి భారీగా నష్టపోయిన అశ్వినీదత్ సినిమా నిర్మాణానికే దూరం అయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తుండటం విశేషం.

ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'బ్రహ్మోత్సవం' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఏప్రిల్ లో మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళంలో తెరకెక్కే ద్విబాషా చిత్రంలో మహేష్ బాబు నటించబోతున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత గౌతమ్ మీనన్ తో మహేష్ బాబు సినిమా చేస్తారు.

English summary
Senior producer Ashwini Dutt today revealed that he will produce the Mahesh-Gautham Menon film and that the project will be launched soon. Ashwini Dutt also said that the film will be released in May next year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu