For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ, ఏడ్చేసిన మహేశ్ బాబు.. మనతోనే ఉంటారంటూ ఎమోషనల్ గా!

  |

  నటుడు, నిర్మాత, దర్శకుడు, సూపర్ స్టార్, నట శేఖర కృష్ణ మరణంతో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో నవంబర్ 15న ఉదయం నాలుగు గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ స్మారకార్థం పద్మాల స్టూడియోలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నట్లు మహేశ్ బాబు తెలిపారు. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మను కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తండ్రి గురించి మహేశ్ బాబు పలు వ్యాఖ్యలు చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.

  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు..

  సూపర్ స్టార్ కృష్ణ మరణం యావత్ సినీ లోకాన్ని తీవ్ర విషాదం మిగిల్చింది. ఆయన లేని లోటు తీర్చలేదని సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తితం, సినిమాపై ఆయన చేసిన ప్రయోగాలను కొనియాడుతూ సినీ, రాజకీయ ప్రముఖులు కొనియాడారు. నవంబర్ 16న అశేష అభిమానుల మధ్య జరిగిన అంతిమయాత్ర అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఇంటి సభ్యులు ఎవరైన చనిపోతే పది రోజుల్లో పెద్ద కర్మ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మను 13వ రోజు నిర్వహించారు.

  అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా..

  అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా..

  ఆదివారం అంటే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రం చేశారు. ముందుగా ఇంటి వద్ద శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఆ తర్వాత అతిథులకు, అభిమానులకు విందు ఏర్పాటు చేశారు. పెద్దకర్మకు వచ్చే అతిథుల కోసం రెండు వేదికలను మహేశ్ బాబు ఏర్పాటు చేసినట్లు సమాచారం. సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్ లో విందు ఏర్పాటు చేయగా.. అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్ లో విందు ఇచ్చారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తారన్న ఉద్దేశంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా పాస్ సిస్టమ్ పెట్టారు. అభిమానులందరికీ పాస్ లు అందజేశారు. అలాగే అభిమానుల కోసం 32 రకాల వంటకాలను మహేశ్ బాబు రెడీ చేయించారట. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

  ఎప్పుడూ రుణపడి ఉంటాను..

  ఎప్పుడూ రుణపడి ఉంటాను..

  ఇంటి వద్ద సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మకు సంబంధించిన కార్యక్రమాలు పూర్తవ్వగానే అభిమానులను పలకరించేందుకు తన బాబాయి ఆది శేషగిరి రావుతో కలిసి జేఆర్సీ కన్వెన్షన్ కి వెళ్లారు మహేశ్ బాబు. ఈ సందర్భంగా తండ్రి గురించి, అభిమానుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు మహేశ్ బాబు. "మా నాన్న నాకు చాలా ఇచ్చారు. అందులో మీ ప్రేమే అతి గొప్ప బహుమతి. నేను ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటాను. నా హృదయంలో నాన్న ఎప్పటికీ నిలిచే ఉంటారు. మీ హృదయాల్లో కూడా స్థిరస్థాయిగా ఉంటారు. ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని మహేశ్ బాబు భావోద్వేగంగా మాట్లాడారు.

  మంత్రితో సరదాగా మహేశ్ బాబు..

  మంత్రితో సరదాగా మహేశ్ బాబు..

  సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, సుధీర్ బాబు, ఆదిశేషగిరి రావు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, మెహర్ రమేష్, నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో మహేశ్ బాబు సరదాగా మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

  English summary
  Mahesh Babu Emotional Speech In His Father Super Star Krishna Pedda Karma At JRC Convention Hall
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X