Don't Miss!
- Finance
Boeing: నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది మందిని రిక్రూట్ చేసుకోనున్న జెట్ లైనర్
- News
మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూత..!!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
మహేష్ బాబుదే టాప్ ప్లేస్.. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్‌లను వెనక్కు నెట్టి!
Recommended Video
సినిమా అనే గ్లామర్ ప్రపంచంలో స్టార్ హీరోలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోలు.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సూపర్ స్టార్స్ వారి వారి ఫాలోయింగ్ వర్గాలు ఎన్నో చూసాం. ఇక ఇప్పటి స్టార్స్ విషయానికొస్తే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు. అయితే వీరందరిలో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరో ఎవరు.. ఆ విషయంలో గూగుల్ ఏమని చెబుతోంది? వివరాలు చూస్తే..

ట్రెండ్ మారింది.. గతం వేరు, ఇప్పుడు వేరు
గతంలో హీరోల అభిమానులంటే కటౌట్స్, థియేటర్స్ వద్ద భారీ హంగామాలు కనిపించేవి. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం మరింత విస్తృతం కావడంతో టెక్నాలజీని వాడుతూ స్టార్ హీరోల అభిమాన వర్గాలు తమ తమ కార్యకలాపాలు చేస్తున్నాయి. మరోవైపు సినీ నిర్మాణ సంస్థలు సైతం సోషల్ మీడియానే ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోలకు సంబందించిన విశేషాలు తెలుసుకోవడానికి గూగుల్ ముఖ్య ఆధారమైంది.

గూగుల్ ఏమని చెబుతోంది?
గూగుల్ అనే సెర్చ్ ఇంజైన్‌ని ఉపయోగించి టాలీవుడ్ లో ఏ హీరోని ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారనే దానిపై తాజాగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో తేలిందేంటంటే.. టాలీవుడ్ హీరోల్లోకెల్లా గూగుల్ ద్వారా ఎక్కువ మంది వెతికే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని. ఈ న్యూస్ తెలిసి మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్
గూగుల్ లో ఎక్కువ మంది వెతికే జాబితాలో మహేష్ బాబు తర్వాత స్థానంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నట్టు గూగుల్ తెలిపింది. అదేవిధంగా వీరిద్దరి తర్వాత వరుసగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లు ఉన్నారని గూగుల్ తేల్చేసింది.

స్టార్ హీరోలు.. సాన్నిహిత్యం
ఈ రిపోర్ట్స్ సంగతి ఎలా ఉన్నా.. నేటితరం స్టార్ హీరోల మధ్య సాన్నిహిత్యం వారి వారి అభిమానులను మరింత ఆనందపరుస్తోంది. ఒకరి సినిమా ఫంక్షన్‌కి మరొకరు గెస్ట్ గా రావడం, పలు ఆడియో ఫంక్షన్స్, కుటుంబ పార్టీల్లో ఫ్యామిలీ సమేతంగా స్టార్ హీరోలంతా కలిసి ఎంజాయ్ చేస్తుండటం అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతోంది.

థియేటర్స్ కళకళ
ఇక ప్రస్తుతం మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉండగా, రామ్ చరణ్- ఎన్టీఆర్ RRR ప్రాజెక్టుతో, ప్రభాస్ 'సాహో' తో అలాగే అల్లు అర్జున్.. తన మూడు కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రథమార్థం స్టార్ హీరోల సినిమాలతో థియేటర్స్ కళకళలాడనున్నాయి.