మరో చిన్నారికి హార్ట్ సర్జరీ.. మానవత్వం ప్రదర్శించిన మహేష్.. నమ్రతా ఎమోషనల్ కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం సినిమాల్లోనే కాకుండా వెండితెర వెనుక కూడా సూపర్ హీరోగా మంచి గుర్తింపును అందుకుంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉండే చిన్నారులకు అండగా నిలుస్తూ వారు కొలుకోవడానికి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. హార్ట్ సర్జరీలు చేయించడంలో ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసిన సూపర్ స్టార్ ఇటీవల మరొక చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఆ సహాయలన్నింటిని భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటోంది.
ఇక రీసెంట్ గా ఆంధ్ర ఆసుపత్రులలో మరో అద్భుతమైన రికవరీ అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. తీవ్రమైన పల్మ్ వాల్వ్ స్టెనోసిస్‌తో అలాగే కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్‌తో పోరాడుతున్న డింపుల్ అనే పాపకు ట్రెట్మెంట్ ఇప్పించాడు మహేష్. ఆమె మునుపటి కంటే మెరుగ్గా ఉందని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని పిల్లలకి, కుటుంబానికి చాలా ఆశీర్వాదాలు అంటూ నమ్రతా వివరణ ఇచ్చింది. నమ్రత సోషల్ మీడియాలో కేవలం తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలనే కాకుండా నలుగురికి సహాయం చేసిన సంతోషలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇక అభిమానులు కూడా మహేష్ బాబు చేస్తున్న పనులను మరింతగా ఆకర్షితులవుతున్నారు. అందుకే మహేష్ అన్నకు ఇంతమంది అభిమానులు ఉన్నారని పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు నెక్స్ట్ సర్కారు వారి పాట అనే సినిమా చేయనున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











