»   » కొడుకు కోరికమేరకు, లండన్ లో ఆ ప్లేస్ కు వెళ్లిన మహేష్ (ఫొటోలు)

కొడుకు కోరికమేరకు, లండన్ లో ఆ ప్లేస్ కు వెళ్లిన మహేష్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఈ రోజు లండన్ కు మూడు వారాలపాటు హాలీడే ట్రిప్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవం షూటింగ్, ప్రమోషన్ అంటూ బాగా అలిసిపోయిన మహేష్..రిలాక్స్ అవటానికి లండన్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆయన లండన్ ట్రిప్ లో ఉండగా తీసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో అభిమానులను అలరిస్తున్నాయి. వాటిని మీరు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు.

అలాగే ఆయన తన కుమారుడు గౌతమ్ కోసం తను లడన్ లో వన్ నేనొక్కిడినే షూటింగ్ చేసిన ప్రాంతాల్లో సరదాగా తన పిల్లలను తిప్పుతున్నారు. వాటిని చూసి గౌతమ్ తెగ ముచ్చటపడి ఫొటోలు దిగుతున్నాడు. సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ ఆ లొకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది ఫ్యామిలి.

ఇక మహేష్ బాబు ఇలా టూర్స్ కు వెళ్లటం కొత్తేమీ కాదు. కాస్త ఖాళీ దొరికితే ఆయన తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయటానికే ప్రయారిటీ ఇస్తూంటారు. పిల్లల హాలీడేస్ సమయంలో వారిని ఇలా టూర్స్ తీసుకువెళ్లి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తూంటారు. నమ్రత సైతం ఇలాంటి ఫ్యామిలీ టూర్స్ అంటే అడ్డుపెట్టదు. ఆమె కూడా ఉత్సాహంగా పాలుపంచుకుంటుంది.

స్లైడ్ షోలో లండన్ టూర్ ఫొటోలు చూడండి..

ప్రయారిటీ

ప్రయారిటీ

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే, ఫ్యామిలీకు ఫుల్ ప్రయారిటీ ఇస్తారన్న విషయం మరోసారి ప్రూవ్ అయ్యింది.

రెడీ...

రెడీ...

షూటింగ్‌ షెడ్యూల్స్లో కాస్త గ్యాప్ దొరికితే చాలు, ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ వేసేందుకు రెడీ అవుతుంటాడు మహేష్.

రెండువారాలు

రెండువారాలు

లండన్‌కు దగ్గరలోని తనకిష్టమైన ప్రాంతాల్లో ఈ రెండు వారాలు విశ్రాంతి తీసుకున్నాక మహేష్ తిరిగి హైద్రాబాద్ ప్రయాణం కానున్నారు.

సన్నాహాలు

సన్నాహాలు

ఇక హైద్రాబాద్ తిరిగొచ్చాక మురుగదాస్‌తో కలిసి చేయబోయే సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టనున్నారు.

పకడ్బందీగా

పకడ్బందీగా

‘బ్రహ్మోత్సవం' సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు చేరువవకపోవడంతో మహేష్ తదుపరి సినిమాను మరింత పకడ్బందీగా ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే..

త్వరలోనే..

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళేందుకు సిద్ధమైంది.

ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాది

ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాది

అలాగే ఈ లండన్ పోగ్రామ్.. ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది అని, బ్రహ్మోత్సవం సెట్స్ మీద ఉన్నప్పుడే డిసైడ్ అయ్యిందని చెప్తున్నారు.

రూమర్స్

రూమర్స్

బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ అయ్యింది కాబట్టి, దాని గురించి మాట్లాడాల్సి వస్తుందని, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కూడా ఉండే అవకాసం ఉందని, అందుకే ఆయన ఈ తలనొప్పులు నుంచి తప్పించుకోవటానికే లండన్ వెళ్లుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎక్కువ శాతం యాంటి ఫ్యాన్స్ నుంచే వస్తూంటాయి. కాబట్టి లైట్ తీసుకోవచ్చు.

English summary
Mahesh Babu left India three days after the release of 'Brahmotsavam'. Mahesh Babu will be spending some quality time with wife and kids in London.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu