»   » సూపర్బ్...సూపర్ స్టార్ : మహేష్ మళ్లీ టాప్ ప్లేస్

సూపర్బ్...సూపర్ స్టార్ : మహేష్ మళ్లీ టాప్ ప్లేస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఇండియాస్ మోస్ట్ డిజైరబుల్ మెన్ కంటెస్ట్ లో టాప్ లో వచ్చారు. ప్రముఖ దిన పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఈ పోల్ లో రీడర్స్ పాల్గొని ఓటేస్తూంటారు. 2013 గానూ ఈ పోల్ జరిగింది. ఈ పోల్ లో చాలా మంది బాలీవుడ్ సెలబ్రెటీలను, టాలీవుడ్ హీరోలను ఈజీగా మహేష్ దాటేసారు.

తాజాగా మహేష్ తన సూపర్ హిట్ దూకుడు కి సీక్వెల్ లో చేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు 'ఆగడు' . దూకుడులో ఖాకీ వేసుకొన్న మహేష్‌.. 'ఆగడు'లోనూ పోలీస్‌ యూనిఫామ్‌లోనే కనిపించనున్నాడు. 'దూకుడు' చిత్రానికి 'ఆగడు' కొనసాగింపులానే ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అయితే గతంలో శ్రీనువైట్ల అటువంటిదేమీ లేదని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి చేస్తున్నది సీక్వెలే అని చెప్పుతున్నారు.

చిత్రంలో పాత్ర గురించి చెప్తూ... అతను గన్‌లోంచి వచ్చిన బుల్లెట్‌లాంటివాడు. ముందుకు సాగడం తప్ప ఆగడం తెలీదు. ఒక్కసారి కమిటైతే... ఎవ్వరి మాటా వినడు. ప్రమాదాల దారిలో ప్రయాణం అతనికి ఆట. మరి ఆ ఆటలో ఎలా గెలిచాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు శ్రీనువైట్ల. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఆగడు'. మహేష్‌బాబు హీరో. తమన్నా హీరోయిన్. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు.

Mahesh Babu is 2013′s most desirable man

మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయికలో ఇది వరకు 'దూకుడు' వచ్చింది. అంతకు మించిన వినోదం ఈ చిత్రంలోనూ ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు. అన్నట్టు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా ఉత్సవాల ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 26 న విడుదల చేయాలనే ఫిక్స్ అయినట్లు అంతర్గత వర్గాల సమాచారం. అలాగే ఆగస్టు 31న ఈ చిత్రం ఆడియోని గ్రాండ్ గా విడుదల చేస్తారని తెలుస్తోంది.

'దూకుడు' తర్వాత మహేష్‌, శ్రీను వైట్ల కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాల్ని అందుకొనేలా 'ఆగడు'ని రూపొందిస్తున్నట్టు సినిమావర్గాలు చెబుతున్నాయి. మహేష్‌ శైలి వినోదం, యాక్షన్‌ అంశాల మేళవింపుతో సాగే ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల,నిర్మాతలు పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu has topped the charts of India’s most desirable men on a number of occasions and he has repeated that feat yet again.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu