»   » మహేష్‌ బాబు సొంత మల్టీప్లెక్స్ లు : 25 మల్టీప్లెక్సులు సిద్దం అవుతున్నాయ్..!?

మహేష్‌ బాబు సొంత మల్టీప్లెక్స్ లు : 25 మల్టీప్లెక్సులు సిద్దం అవుతున్నాయ్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు ఒకప్పుడు ఇంత యాక్టివ్ గా ఉండేవాడు కాదు స్టేజ్ మీదకి రావటమే అరుదు వచ్చినా మాట్లాడటం ఉండేది కాదు. తెరమీద తప్ప బయట మరీ మొహమాటంగా ఉండేవాడు. తన సినిమాల వేడుకలకు కూడా హాజరయ్యేవాడు కాదప్పట్ళో. కానీ నమ్రత రాక మహేష్ ని చాలా మార్చేసింది.

బోలెడన్ని బ్రాండ్ల ప్రచారకర్తగా మారాడు.

బోలెడన్ని బ్రాండ్ల ప్రచారకర్తగా మారాడు.

సినిమాలతో సమానంగా వాణిజ్య ఒప్పందాల ద్వారా కూడా ఆదాయం ఆర్జించడం మొదలుపెట్టాడు. అసలు మహేష్ రాకకు ముంది యాడ్ ఫిలింస్ చేసిన హీరోలు ఉన్నా కూడా అంత పెద్దగా దృష్టి ఎవరూ పెట్టలేదు. కానీ మహేష్ ఒప్పుకున్న ఎండార్స్ మెంట్లేవీ మామూలువి కావు. ఇప్పుడు మహేష్ ని చూసి యాడ్ ల బాట పట్టిన హీరోలు చాలామందే ఉన్నారు. ఇప్పుడు మహేష్ బిజినెస్ మ్యాన్ గా కూడా మారుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో

హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం మహేష్ మన ఇరు రాష్ట్రాలలోను 25 మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ల నిర్మాణానికి వ్యూహాలు రచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఏషియన్ సినిమా సంస్థతో భాగస్వామిగా చేరి మహేష్ ఈ 25 మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ల నిర్మాణానికి సంబంధించి ప్రాధమిక చర్చలు జరుపుతున్నాడట...

ముఖ్యంగా

ముఖ్యంగా

కోస్తా జిల్లాలలో అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ముఖ్య పట్టణాలలో ఈ మల్టీ ఫ్లెక్స్ ధియేటర్ల నిర్మాణం జరుగుతుంది అని టాక్. ప్రస్తుతం ప్రేక్షకులు అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ధియేటర్లలో సినిమాలు చూడటానికి ఆసక్తి కనపరుస్తున్న నేపధ్యంలో మహేష్ ఏషియన్ సంస్థతో కలిసి ఈ ఆలోచనలతో అడుగులు వేస్తున్నట్లు టాక్.

ఈ బిజినెస్ లో

ఈ బిజినెస్ లో

మహేష్ ప్రత్యేకంగా చేసేదేం లేదు. జస్ట్ బ్రాండ్ అంబాసిడర్లా ఉంటాడు. ఏదైనా వ్యవహారాలుంటే నమ్రత చూసుకుంటుంది. మల్టీప్లెక్స్ బిజినెస్ అన్నది ఇప్పుడు లాభసాటిగా మారిన వ్యవహారం కాబట్టి మహేష్ ఇందులో కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలుంటాయని.. ఆ తర్వాత అతను ఇలాంటి బిజినెస్ లు మరి కొన్ని టేకప్ చేసే అవకాశాలుంటాయని అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో మరి.

English summary
As per the speculations, Mahesh Babu will soon build as many as 25 Multiplexes in Telugu States. Sunil Narang of Asian Cinemas would be the acting partner of this business venture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu