»   » మహేష్ బాబు ‘పవర్’ఆడియో(ఫొటోలు)

మహేష్ బాబు ‘పవర్’ఆడియో(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు కి తెలుగులోనే కాదు కన్నడ నాట కూడా అపారమైన అభిమాన సంపద ఉందని మరోసారి ప్రూవ్ అయ్యింది. బళ్లారిలో కన్నడ టాప్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన 'పవర్' ఆడియో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఆ ఆడియో వేడుకకి మహేష్ బాబు కోసం భారీగా అభిమానులు తరలి వచ్చారు. బళ్లారిలో ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండడం వల్ల చాలా మంది మహేష్ బాబు కోసం ఈ ఆడియో వేడుకకి వచ్చారు.

'పవర్' సినిమా తెలుగులో సూపర్ హిట్ అయిన 'దూకుడు'కి రీమేక్. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ వారు ఈ సినిమాని నిర్మించడం వలన మహేష్ బాబు ఈ మూవీ ఆడియో లాంచ్ కి వచ్చాడు. ప్రస్తుతం మహేష్ బాబు 'ఆగడు' షూటింగ్ బళ్లారిలో జరుగుతోంది. జూలై 2 వరకూ అక్కడే షూటింగ్ జరుపుకోనుంది.

స్లైడ్ షోలో...ఫోటోలు

సూపర్ హిట్...

సూపర్ హిట్...

మహేష్ కు కన్నడంలో నూ అభిమానులు ఉండటంతో ఖచ్చితంగా ఆ ఆడియో పంక్షన్ సూపర్ హిట్ అవుతుందని భావించారు అదే జరిగింది.

స్నేహంతో..

స్నేహంతో..

ఈ చిత్రం నిర్మాతలు 14 రీల్స్ వారు కావటం, చిత్రం హీరో పునీత్ రాజ్ కుమార్ కి మహేష్ తో మంచి స్నేహం ఉండటంతో మహేష్ ఈ పంక్షన్ కి వెళ్ళారు.

టీజర్ హిట్..

టీజర్ హిట్..

మహేష్ బాబు సూపర్ హిట్ చిత్రం దూకుడు. ఆ చిత్రం లో విజువల్స్ ని మహేష్ స్టైల్స్ ని ఎవరూ మర్చిపోలేరు. ఇప్పుడు దూకుడు ని యాజటీజ్ దింపేస్తూ..మహేష్ మ్యానరిజంస్ తో సహా 'పవర్' ఫస్ట్ లుక్ టీజర్ దూకింది. అయితే ఈ చిత్రం మహేష్...దూకుడు కి రీమేక్. 14 రీల్స్ వారే కన్నడంలోనూ నిర్మిస్తున్నారు.

అనుకరణ అయినా...

అనుకరణ అయినా...

మాదేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మహేష్ ని అనుకరిస్తూ పునీత్ రాజ్ కుమార్, త్రిష నటించారు. అక్కడ టీజర్స్ కు మంచి స్పందన వచ్చింది.

అదే నిర్మాతలు కావటంతో..

అదే నిర్మాతలు కావటంతో..

మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన తెలుగు చిత్రం ‘దూకుడు' అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులు అమితంగా ఆకట్టుకున్న సినిమాగా ఈ చిత్రం పేరు తెచ్చకుంది. ఈ చిత్రం త్వరలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.

సమంత ప్లేస్ లో త్రిష

సమంత ప్లేస్ లో త్రిష

ఇప్పటివరకు తెలుగు, తమిళ భాషల్లో నటించిన త్రిష పలు విజయవంతమైన చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తొలిసారి ఆమె కన్నడలో ‘దూకుడు' చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాకు త్రిష భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు కన్నడ చిత్రసీమలో చర్చ జరుగుతోంది.

మహేష్ మాట్లాడుతూ...

మహేష్ మాట్లాడుతూ...

చిత్రం ఘన విజయం సాధిస్తుందని,తెలుగు మాదిరిగానే రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిలషించారు

నిర్మాతలు మాట్లాడుతూ..

నిర్మాతలు మాట్లాడుతూ..

చిత్రం దర్శకుడు తెలుగు తరహాలో చక్కగా నిర్మించారని, ఇక్కడ కూడా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.

English summary
Mahesh Babu to launched Power Star's "Power" audio at Bellary Municipal Ground. The Kannada remake of Tollywood blockbuster 'Dookudu' has been titled as 'Power' which stars Puneet Rajkumar and Trisha in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu